Begin typing your search above and press return to search.

బాలుడి ఆర్తనాదం కదిలించింది.. కోట్లు కురిపించింది..

By:  Tupaki Desk   |   23 Feb 2020 5:30 PM GMT
బాలుడి ఆర్తనాదం కదిలించింది.. కోట్లు కురిపించింది..
X
ఓ చిన్నారి తన ఏడుపుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తనతోటి విద్యార్థులు పొట్టిగా ఉన్నావని ఆ చిన్నారిని నిత్యం ఏడిపించేవారు. దీంతో ఆ బాలుడు స్కూల్ కు వెళ్లనని మారం చేసేవాడు. పిల్లాడి పరిస్థితిని అర్థం చేసుకున్న బాలుడి తల్లి తానే స్వయంగా స్కూల్ కి తీసుకెళ్లింది. రోజులాగే తోటి విద్యార్థులు ఆ బాలుడిని ఆటపట్టించడంతో ఏడువసాగాడు. ఈ తంతంగాన్ని అక్కడే ఉన్న బాలుడి తల్లి యర్రక బేల్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

తొమిదేళ్ల క్వాడన్ బెల్స్ శారీరక ఎదుగుదలేక పొట్టిగా(మరుగుజ్జు)గా కనిపిస్తాడు. ఇదే అతని పాలిట శాపంగా మారింది. స్కూల్లో తోటి విద్యార్థులను అతడిని పొట్టి.. పొట్టి అంటూ ఆటపట్టించడంతో నిత్యం ఆటపట్టేంచేవారు. దీంతో క్వాడన్ బెల్స్ ‘నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది’ అంటూ ఏడువసాగాడు. దీనిని బాలుడి తల్లి వీడీయోతీసి పోస్టు చేసింది. ‘నేను ఇప్పుడే స్కూల్ నుంచి నా కొడుకును తీసుకొచ్చాను.. తనను ఏడిపించడం కళ్లారా చూశారా.. పిల్లలను ఏడిపిస్తే ఎలాంటి అనర్థాలు జరిగుతాయో అందరికీ తెలియజేయాలనుకుంటున్నా’ అంటూ క్వాడన్ బెల్స్ ఏడిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడీయోను ఇప్పటివరకు కోటి 40లక్షల మందికిపైగా చూశారు.

‘#WeStandWithQuaden’ అనే హ్యష్ ట్యాగ్ తో ఆ బాలుడికి ఎంతోమంది మద్దతు తెలిపారు. హాలీవుడ్ నటుడు హ్యు జాక్ మెన్, బాస్కెట్ బాల్ ఆటగాడు ఎనెస్ కాంటెర్, డోనల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ ఆ పిల్లడికి మద్దతుకు ప్రకటించారు. అంతేకాకుండా పలువురు చిన్నారులకు క్వాడన్ బెల్స్ నీవు అందరి కంటే బలవంతుడివి అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. హస్యనటుడు బ్రాడ్ విలియమ్స్ క్వాడన్ కు మద్దుతగా ‘ఒక గో ఫండ్ మి’ పేరుతో ఒక పేజీని ప్రారంభించారు. క్వాడన్ కు పెద్ద సంఖ్యలో విరాళాలు వచ్చాయి. ఒక్కరోజులో 130వేల డాలర్లు(93లక్షలు)పైగా సేకరించారు. మొత్తంగా 3లక్షల అమెరికన్ డాలర్లు(2.1కోట్లు) సేకరించారు.

ఏదిఏమైనా క్వాడన్ లాంటి బాలుడికి ప్రపంచ వ్యాప్తంగా మేమున్నమంటూ మద్దతు లభించడం అభినందనీయం. ఇప్పటికైనా విద్యార్థుల తోటివారిని గేలి చేయడం, ఏడిపించడం, మారు పేర్లతో పిలువడం లాంటివి చేయకుండా మంచిగా తల్లిదండ్రులు పెంచాలని పలువురు కోరుతున్నారు. దీనిపై స్పందించిన పాఠశాల ప్రిన్సిపాల్ ఇలాంటి చర్యలు ఇకముందు జరుగకుండా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.