Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ శాంసంగ్ వివాదాస్పద క్యూఆర్ కోడ్: చెలరేగిన అల్లర్లు

By:  Tupaki Desk   |   2 July 2022 8:38 AM GMT
పాకిస్తాన్ శాంసంగ్ వివాదాస్పద క్యూఆర్  కోడ్: చెలరేగిన అల్లర్లు
X
పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగాయి. మహ్మద్ ప్రవక్తపై కించపరిచే క్యూఆర్ కోడ్ రూపొందించారని శాంసంగ్ కంపెనీపై స్థానికులు మండిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్లో దైవ ధూషణకు అక్కడి చట్టం తీవ్ర నేరంగా పరిగణిస్తుంది. గతంలో శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి గత డిసెంబర్లో ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు సియాల్ కోట్ లో మూక హత్యకు గురయ్యాడు.

అయితే ఇప్పుడు శాంసంగ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న ఉత్కఠ నెలకొంది. కానీ ఇప్పటికే కొరియన్ కంపెనీ అంతర్గత దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. అతేకాకుండా సంఘటన నేపథ్యంలో పాకిస్తాన్ కు క్షమాపణలు చెబుతున్నట్లు శాంసంగ్ తెలిపింది.

కరాచీలోని స్టార్ సిటీ మాల్ లో ఇన్ స్టాల్ చేసిన ఓ వైఫై డివైజ్ కారణంగా ఈ మత రచ్చ మొదలైంది. దీంతో కొందరు నిరసనకారులు ఈ మాల్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. అయితే ఇదే సమయంలో శాంసంగ్  తీసుకొచ్చిన క్యూ ఆర్ కోడ్ మహ్మద్ ప్రవక్త ను కించపరిచే విధంగా ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. దీంతో గొడవ మరింత పెద్దదైంది. నిరసన కారులు శాంసంగ్ కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొందరు రెచ్చిపోయిన మాల్ పై దాడి చేశారు. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి.

ఈ విషయం పోలీసులకు చేరడంతో వారు మాల్ దగ్గరికి చేరుకున్నారు. ఆ తరువాత ప్రాథమిక దర్యాప్తు చేసి 27 మంది శాంసంగ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడికి పాల్పడింది తెహ్రీక్ -ఈ-లబ్బాయికి చెందిన సభ్యులను గుర్తించారు. కానీ వారిని అరెస్టు చేయలేదు. ఎందుకంటే ఇక్కడ దైవదూషణకు సంబంధించిన చట్టం పకడ్బందీగా ఉంటుంది.

మహ్మద్ ప్రవక్తకు సంబంధించిన ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే శిక్షలు దారుణంగా ఉంటుంది. వారి నేర ప్రకారం జరిమానాతో పాటు కఠినంగా శిక్షను అమలు చేశారు. అయితే ఆందోళన కారులు తమ దైవాన్ని ధూషించారని ఆరోపిస్తున్న నేపథ్యంలోవారిని అరెస్టు చేయనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ సంఘటపై కొరియన్ కంపెనీ రియాక్టయింది. మహ్మద్ ప్రవక్తను కించపరిచిందన్న ఆరోపణలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించింది. ఇక తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఒకవేళ కావాలనే తప్పు చేసినట్లు నిర్దారణ అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మతపరమైన భావాలపై తటస్థంగా ఉంటామని పేర్కొంది. ఈ విషయాన్ని శాంసంగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.