Begin typing your search above and press return to search.

యూకే ప్రధానికి వార్నింగ్ ఇచ్చిన పుతిన్.. ఆలస్యంగా వెలుగులోకి..!

By:  Tupaki Desk   |   30 Jan 2023 1:50 PM GMT
యూకే ప్రధానికి వార్నింగ్ ఇచ్చిన పుతిన్.. ఆలస్యంగా వెలుగులోకి..!
X
ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్.. నాటోలో చేరేందుకు యత్నించడంపై రష్యా తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమ మాటను పెడచెవిన పెట్టిన ఉక్రెయిన్ రష్యా గత ఏడాది ఫిబ్రవరిలో దండయాత్రకు దిగిన సంగతి తెల్సిందే. అయితే రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి ముందు నాటి యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని బోరిస్ జాన్సన్ తాజాగా వెల్లడించినట్లు బీబీసీ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీంతో ఈ విషయం వైరల్ గా మారడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీబీసీ కథనం ప్రకారం మేరకు.. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా దాడికి ముందు తన కార్యాలయానికి ఒక ఫోన్ కాల్ వచ్చిందని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఫోన్లో తనతో మాట్లాడిన పుతిన్ బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

బోరిస్ మిమ్మల్ని గాయపర్చడం తమ ఉద్దేశం కాదని.. అయితే మీపై మిస్సైల్ దాడి తప్పదని.. అందుకు తమకు ఒక్క నిమిషం కూడా పట్టదని పుతిన్ బోరిస్ కు వార్నింగ్ ఇచ్చినట్టు బీబీసీ తన డాక్యుమెంటరీలో ప్రసారం చేసింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ నాటోలో చేరే వ్యవహారంపై ఇరువురి మధ్య హాట్ హాట్ గా డిస్కషన్ నడిచింది. ఆ సమయంలో బోరిన్ చాలా సహనంగా వ్యవహరించినట్లు గుర్తు చేసుకున్నారు.

కాగా ఉక్రెయిన్ పై రష్యా దాడికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండించిన పాశ్చాత్య దేశల నేతల్లో బోరిస్ సైతం ఉన్నారు. ఈ ఘటన జరిగిన కొన్నాళ్లకు బోరిస్ జాన్సన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసిన యూకే సహా యూరోపియన్ దేశాలు ఆ దేశంపై కఠిన ఆంక్షలకు దిగిన సంగతి తెల్సిందే.

మరోవైపు బ్రిటన్లో ఆర్థిక మాంద్యం.. రాజకీయ సంక్షోభం తదితర నేపథ్యంలోనే బోరిస్ జాన్సస్ తన పదవీ రాజీనామా సైతం చేయాల్సి వచ్చింది. రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో బ్రిటన్ సహా నాటో దేశాలు పరోక్షంగా ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ సైతం రష్యాకు ధీటుగా జవాబు చెబుతుంది. ఏది ఏమైనా ఒక దేశ ప్రధానిని మరో దేశ అధ్యక్షుడు ఫోన్లో బెదిరించడం మాత్రం ఒకింత ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.