Begin typing your search above and press return to search.

పుష్ప సినిమా స్టైల్ లో 55మంది ఎర్రచందనం స్మగ్లర్స్.. పోలీసులకు చిక్కారిలా..?

By:  Tupaki Desk   |   25 Jan 2022 2:30 AM GMT
పుష్ప సినిమా స్టైల్ లో 55మంది ఎర్రచందనం స్మగ్లర్స్.. పోలీసులకు చిక్కారిలా..?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఇండియా వైడ్ ఇప్పుడు హిట్ టాక్ తెచ్చుకొని ట్రెండింగ్ గా మారింది. ఈ మూవీలో ఎర్రచందనం దుంగల్ని లారీలో ఎక్కించిన తర్వాత లోడ్ ఎత్తే సమయంలో పోలీసులు దాడి చేయడం.. ఆ టైంలో అల్లు అర్జున్ వీరోచితంగా లారీని దాచి సరుకును సేఫ్ చేయడం హైలెట్ గా నిలుస్తుంది.

సరిగ్గా అలాంటి సీన్ యే నెల్లూ జిల్లాలో తాజాగా చోటుచేసుకుంది. ఎర్రచందనం లోడ్ ఎత్తే సమయానికి పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో 55 మంది తమిళనాడు కూలీలు, 3 స్మగ్లర్లు పరారయ్యారు. పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్ చేసి మరీ అందరినీ అరెస్ట్ చేసి లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనంను పట్టుకున్నారు.

నెల్లూరు జిల్లా రావూరు అటవీ ప్రాంతంలో తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన 55 మంది కూలీలతో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను నరికివేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అటవీ ప్రాంతానికి బయలు దేరారు. పోలీసులు వస్తున్నారన్నా సమాచారంతో ఎర్రచందనం స్మగ్లర్లు అడివిలోంచి పరాయ్యారు. రెండు వాహనాల్లో చెన్నై వెళుతుండగా గూడురు సమీపంలోని టోల్ ప్లాజా వద్ద పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. కొందరు కూలీలు పోలీసులపై దాడికి పాల్పడగా పలువురు కానిస్టేబుల్స్ కు గాయాలయ్యాయి.

మొత్తం 55 మంది ఎర్రచందనం కూలీలు, ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశామని ఎస్పీ విజయరావు తెలిపారు. వీటి విలువ రూ.36.13 లక్షలు ఉంటుందని తెలిపారు. గొడ్డెలం్లు, బరికెలు స్వాధీనం చేసుకున్నారు. అచ్చం పుష్ప మూవీలో సీన్ ను ఇది తలపించింది.