Begin typing your search above and press return to search.

కుక్కను కిడ్నాప్ చేసిన జొమోటో డెలివరీ బాయ్

By:  Tupaki Desk   |   9 Oct 2019 9:57 AM GMT
కుక్కను కిడ్నాప్ చేసిన జొమోటో డెలివరీ బాయ్
X
ఇవాల్టి రోజున డెలివరీ బాయ్ లు ఇళ్లకు రావటం మామూలైంది. ఆన్ లైన్ మార్కెట్ పెరగటంతో వివిధ వస్తువుల్ని డెలివరీ ఇచ్చేందుకు ఇళ్లకు వచ్చి వెళుతున్న వైనం చూస్తున్నా.. ఎప్పుడూ ఎదురుకాని చిత్రమైన ఘటన మహారాష్ట్రలోని ఫూణెలో చోటు చేసుకుంది. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ను డెలివరీ చేయటానికి వచ్చి జొమాటో డెలివరీ బాయ్.. పెంపుడు కుక్కను కిడ్నాప్ చేసిన వైనం సంచలనంగా మారటమే కాదు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఫూణేకు చెందిన వందనా షా అనే బాధితురాలికి ఒక పెంపుడు కుక్క ఉంది. ఫుడ్ డెలివరీ కోసం ఆర్డర్ ఇస్తే.. ఇంటికి వచ్చిన డెలివరీ బాయ్ తాము ముద్దుగా పెంచుకునే డోటు అనే కుక్కను కిడ్నాప్ చేసినట్లు చెబుతున్నారు. పుడ్ డెలివరీ బాయ్ వెళ్లిన కాసేపటికి తమ కుక్క కనిపించకపోవటంతో అనుమానం వచ్చి సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలించారు.

ఇంటి ఆవరణలో కాసేపు తిరిగిన కుక్క.. ఆ తర్వాత పక్కనే ఉన్న ఫ్యాక్టరీ ఆవరణలో ఆడుకోవటం కనిపించింది. తర్వాత కనిపించలేదు. డోటు కోసం విపరీతంగా వెతికి.. పలువురిని ఆరా తీసిన తర్వాత జొమాటో డెలివరీ కుర్రాడే కుక్కను వెంట బెట్టుకు వెళ్లి ఉంటారని అనుమానించారు. ఆ వెంటనే పోలీసుల్ని కలిసి విషయం చెప్పగా.. వారు కేసు కట్టలేదు కానీ తామీ ఇష్యూను చూస్తామని చెప్పారు.

పోలీసులతో కాదని.. తనకు తానుగా మరిన్ని ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు వందనా షా. ఆమె ప్రయత్నాలు ఫలించి తమ ఇంటికి కాస్త దూరంలో ఒక షాపులో కుక్కతో ఒకరు ఆడుకున్న విషయాన్ని ఆమెకు చెప్పారు. దీంతో.. డెలివరీ కుర్రాడే తన కుక్కను తీసుకెళ్లి ఉంటాడని గుర్తించిన ఆమె.. ఆ కుర్రాడి ఫోన్ నెంబరును సంపాదించి.. అతడికి ఫోన్ చేశారు.

అయితే.. తాను కుక్కను తీసుకెళ్లలేదని.. తన వెంట వచ్చిందని.. ముద్దుగా ఉంటే వెంట తీసుకెళ్లినట్లు చెప్పారు. తాము పెంచుకునే కుక్క అని.. దాన్ని తిరిగి ఇవ్వాలని.. కావాలంటే డబ్బులు ఇస్తామని చెప్పినా సదరు డెలివరీ బాయ్ ససేమిరా అన్నాడు. సంబంధం లేని మాటలు చెబుతూ.. ఆ కుక్కను తమ ఊరికి పంపినట్లు చెప్పారు.

దీంతో.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతోఈ ఉదంతం వైరల్ గా మారింది. డెలివరీ బాయ్ పేరు తుషార్ గా తేల్చారు. ఈ అంశంపైజొమాటో కూడా రియాక్ట్ అయ్యింది. డెలివరీ బాయ్ మీద చర్యలు తీసుకుంటామని చెబుతూ.. అతడి కోసం వెతుకుతున్నారు. ఇదిలా ఉంటే.. తుషార్ తన మొబైల్ ఫోన్ ను స్విఛాప్ చేయటంతో వందనా షా ఆందోళన అంతకంతకూ ఎక్కువ అవుతోంది.