Begin typing your search above and press return to search.

వామ్మో ... పేస్ మాస్క్ ధర రూ.2లక్షల 89వేలు

By:  Tupaki Desk   |   4 July 2020 9:50 AM GMT
వామ్మో ... పేస్ మాస్క్ ధర రూ.2లక్షల 89వేలు
X
వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైంది. దీంతో యావత్ ప్రపంచం మాస్కుల బాట పట్టింది. కాగా, మార్కెట్ లోకి రకరకాల మాస్కులు వచ్చాయి. బ్రాండ్ ను బట్టి వాటి ఖరీదు ఉంటుంది. కొన్ని మాస్కుల ధర 50 రూపాయల లోపు ఉంది. కొన్నింటి ఖరీదు వందలు, వేల రూపాయాల్లో ఉంది. కానీ ఆ మాస్క్ ధర మాత్రం అక్షరాల రూ.2లక్షల 89వేలు .. అదేంటి మాస్క్ ధర రూ.2లక్షల 89వేలా అని ఆశ్చర్యపోతున్నారా ... అది సాధారణ మాస్క్ కాదు బంగారం మాస్క్.

పూర్తి వివరాలు చూస్తే ... మాస్కులు లేక పోతే చిన్న టవల్స్ లేదా దుప్పటాలు ,లేదా చున్నీలు ముఖాలకు చుట్టేసుకుని వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ పూణేలోని పింప్రీ - చించ్వాడ ప్రాంతంలో ఓ వ్యక్తి మాత్రం తన మాస్కును బంగారంతో చేయించుకున్నాడు. ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇప్పుడూ పూణే నగరంలో ఎవరూ చూసిన బంగారు మాస్కు ధరించిన శంకర్ కురాడే గురించే మాట్లాడుకుంటున్నారు. అసలే బంగారం ధర కొండెక్కి కూర్చున్న సమయంలో శంకర్ బంగారు మాస్కు ధరించడం పలువురు చర్చించుకుంటున్నారు. గోల్డ్ తో చేసిన అతడి మాస్క్ ధర అక్షరాల రూ.2లక్షల 89వేలు.

కాగా, శంకర్ ఒంటి నిండా బంగారం కనిపిస్తోంది. ఆయన చేతికి బంగారంతో చేసిన కడియం ఉంది. ఇక ఐదు వేళ్లకు ఐదు బంగారు ఉంగరాలు ఉన్నాయి. దీన్ని బట్టి శంకర్ బాగా రిచ్ అనే విషయం అర్థమవుతోంది. ఈ గోల్డ్ మాస్క్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీన్ని ధరిస్తున్న కారణంగా శంకర్ ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయాడు. అయితే కాస్త జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు శంకర్ కి సూచిస్తున్నారు. అసలే బంగారం ధర భగభగమంటోంది. తులం పుత్తడి రూ.50వేలు పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో దొంగలతో జాగ్రత్త అని చెప్పారు. కాగా కొందరు నెటిజన్లు శంకర్ తీరుపై విమర్శలు చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం భారత్‌ లో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 6 లక్షలు చేరుకోగా 18వేలకు పైగా మృతి చెందారు. ఇక పూణే విషయానికొస్తే ఆ ఒక్క నగరంలోనే 6వేలు వైరస్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 274 మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందారు.