కరోనాపై ప్రధాని మోడీ సమీక్ష..ఏం చేశారంటే?

Tue Feb 23 2021 23:00:02 GMT+0530 (IST)

Prime Minister Modi's review on Corona

దేశంలో కరోనా దాదాపు కనుమరుగైందనుకుంటున్న సమయంలో మళ్లీ విజృంభించడంతో ప్రధాని నరేంద్రమోడీ అలెర్ట్ అయ్యారు. దేశంలో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సమీక్ష చేపట్టారు.ప్రధానమంత్రి కార్యాలయంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. దేశంలో వైరస్ తాజా పరిస్థితి.. కొత్త రకం వైరస్ వ్యాప్తి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.ముఖ్యంగా మహారాష్ట్ర కేరళలో కరోనా విజృంభిస్తోంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 75శాతం ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ను మోడీ ఇటీవలే ప్రారంభించారు. వ్యాక్సిన్ ను మొదట వైద్యులు వైద్యసిబ్బందికి ఇప్పించారు. వసతులు పెంచి వ్యాక్సిన్ నిల్వచేసేలా ఏర్పాట్లు చేయాలని.. వ్యాక్సిన్ కంపెనీల అనుసంధానం తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్టు మోడీ తెలిపారు.

ప్రస్తుతం దేశంలో 5 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయని మోడీకి అధికారులు తెలిపారు. రెండు అందుబాటులోకి రాగా మరో రెండు వరుసలో ఉన్నాయి.  ఇక వ్యాక్సిన్ వాడకం అభివృద్ధి కోసం  బంగ్లాదేశ్ మయన్మార్ ఖతార్ స్విట్లర్లాండ్ బహ్రెయిన్ ఆస్ట్రియా సౌత్ కొరియా దేశాలు భారత్ తో ఒప్పందానికి ఆసక్తిగా ఉన్నాయని మోడీ తెలిపారు. మెడికల్ సామగ్రి కొనుగోళు తదితర ఏర్పాట్లను చేస్తున్నట్టు తెలిపారు.