Begin typing your search above and press return to search.

రాష్ట్రాలకు వదిలేసిన ప్రధాని మోడీ

By:  Tupaki Desk   |   12 May 2021 2:30 PM GMT
రాష్ట్రాలకు వదిలేసిన ప్రధాని మోడీ
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అల్లకల్లోలంగా పరిస్థితులున్నాయి. రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అయితే అండగా నిలవాల్సి కేంద్రం మాత్రం చోద్యం చూస్తోందన్న ఆరోపణలున్నాయి.

తాజాగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు తమకు తాముగా లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి. దేశంలోని `8 రాష్ట్రాలు లాక్ డౌన్.. మిగతా రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్, వారంతపు లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి చర్యలు చేపట్టాయి. తాజాగా తెలంగాణ, నాగాలాండ్ సైతం లాక్ డౌన్ ప్రకటించడంతో దేశమంతా తాళం పడింది. కరోనా కట్టడికి సహకరించాలని కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సహాయం చేయాలని గగ్గోలు పెడుతున్నాయి. అయినా కేంద్రంలో స్పందన లేదని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.

బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కూడా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని పలువురు ఉదహరిస్తున్నారు. సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని.. ప్రతిపక్షాలతో పాటు మేధావులు, జాతీయ మీడియా కూడా విమర్శిస్తోంది. అయినా కూడా కేంద్రంలో ఎలాంటి మార్పు రాలేదని మనం చూస్తూనే ఉన్నామని విశ్లేషకులు అంటున్నారు.

లాక్‌డౌన్‌ లేకపోయినా ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌ కొరత లేకుండా చూడాలని.. వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రధాని మౌనం దేశానికి శాపంగా మారిందని.. నోరు విప్పి ప్రజలకు కొంత భరోసా కలిగించే చర్యలు తీసుకోవాలని ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలు, ప్రజలు ఏదో ఒకటి వస్తుందని కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నాయి.

రాష్ట్రాలకు అయినా కేంద్రం సహకరించాలని అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఏడాది కన్నా ప్రస్తుతం కేంద్రం దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ప్రధాని మోడీ వైఖరిలో మార్పు వస్తుందో లేదో వేచిచూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.