Begin typing your search above and press return to search.

ధర తక్కువ..సమర్ధత ఎక్కువ .. గేమ్‌ ఛేంజర్‌ గా కార్బెవాక్స్ 'టీకా'!

By:  Tupaki Desk   |   17 Jun 2021 11:30 PM GMT
ధర తక్కువ..సమర్ధత ఎక్కువ .. గేమ్‌ ఛేంజర్‌ గా కార్బెవాక్స్ టీకా!
X
మొత్తం స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్‌ కు చెందిన బయాలాజికల్-ఈ సంస్థ తయారు చేస్తున్నకార్బెవాక్స్ కరోనా వైరస్ వ్యాక్సిన్‌ కు సంబంధించి మరో ఊరట లభించనుంది. దేశంలోనే అత్యంత సమర్ధతతో పాటు అత్యంత చౌకైన ధరకే ఈ వ్యాక్సిన్ లభించనుంది ఈ మేడిన్‌ ఇండియా కరోనా వ్యాక్సిన్ 90 శాతం ప్రభావాన్ని కలిగి ఉంటుందని , కరోనా మహమ్మారిపై పోరాటంలో గేమ్‌ ఛేంజర్‌ గా ఉండనుందని భావిస్తున్నామని ప్రభుత్వసలహా ప్యానెల్‌ ఉన్నత సభ్యలొలకరు తెలిపారు. త్వరలోనే ఈ వ్యాక్సిన్‌ ఫేజ్ 3 ట్రయల్స్‌ లోకి ప్రవేశిస్తోందని, అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానుందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ చైర్‌ పర్సన్ ఎన్‌ కె అరోరా తెలిపారు. నోవావాక్స్ వ్యాక్సిన్ మాదిరిగానే ఉందని, కార్బెవాక్స్ 90 శాతం సమర్ధతను ప్రదర్శించనుందని తెలిపారు. అలాగే ఈ వ్యాక్సిన్‌ కూడా అన్నికోవిడ్‌-19 వేరియంట్ల పై సమర్ధవంతంగా పనిచేస్తుందని అన్నారు.

ఈ టీకా రెండు మోతాదుల ధర గణనీయంగా తక్కువ ధరకే లభించనుందని చెప్పారు. సుమారు రూ. 250 వద్ద చాలా తక్కువ ధరకు అందు బాటులోకి రానుందని పేర్కొన్నారు. సరసమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కోసం ప్రపంచమంతా భారతదేశంపై ఆధారపడే సమయం రానుందని డాక్టర్ అరోరా అన్నారు. అంతిమంగా ప్రపంచం టీకాల కోసం మనపై ఆధారపడిఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన పూణేకు చెందిన సీరం, అహ్మదాబాద్‌కు చెందిన కాడిల్లా ఫార్మా లాంటి భారతీయ ఔషధ పరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. టీకాల కోసం ప్రతి ఒక్కరూ భారతదేశంవైపు చూస్తున్నారు. ఎందుకంటే చాలా పేద దేశాలు, తక్కువ ఆదాయ దేశాలకు వేరే మార్గం లేదు.

ప్రస్తుతం కొవిషీల్డ్‌ ఒక్కో డోసును ప్రభుత్వానికైతే రూ. 300కు, ప్రయివేటు సంస్థలకైతే రూ. 600కు విక్రయిస్తున్నారు. కొవాగ్జిన్‌ ఒక్కో డోసును ప్రభుత్వానికి రూ. 400కు, ప్రయివేటు సంస్థలకు రూ. 1200కు అందిస్తున్నారు. స్పుత్నిక్‌ టీకా ధర ఒక్కో డోసును రూ. 995కు విక్రయిస్తున్నారు. బయోలాజికల్‌-ఇ టీకా కనుక అందుబాటులోకి వస్తే కొవాగ్జిన్‌ తర్వాత అందుబాటులోకి వస్తున్న రెండో స్వదేశీ టీకా అదే అవుతుంది. అమెరికాకు చెందిన బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో కలిసి బయోలాజికల్‌-ఇ సంస్థ కొవిడ్‌ టీకాను అభివఅద్ధి చేసింది. దేశంలో త్వరలోనే స్పుత్నిక్‌-వి, స్పుత్నిక్‌ లైట్‌తోపాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సింగిల్‌ డోస్‌ టీకా, ముక్కు ద్వారా వేసే టీకాలు అందుబాటులోకి రానున్నాయి. ఇవి మార్కెట్లోకి వస్తే మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఊపందుకుంటుంది.