Begin typing your search above and press return to search.

భారత్‌ లో ఒకేరోజు ట్రంప్ - యూకే సుప్రీం కోర్టు లార్డ్ రాబర్డ్

By:  Tupaki Desk   |   24 Feb 2020 2:45 PM GMT
భారత్‌ లో ఒకేరోజు ట్రంప్ - యూకే సుప్రీం కోర్టు లార్డ్ రాబర్డ్
X
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు (ఫిబ్రవరి 24)న భారత్‌ లో అడుగు పెట్టారు. అహ్మదాబాద్‌ లోని మోతెరా స్టేడియంలో లక్షలాది మంది వేదికగా ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వేదికను పంచుకున్నారు. ఇదే రోజు మరో కీలక ఘటన చోటు చేసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రాబర్డ్ జాన్ రీడ్ సుప్రీం కోర్టును సందర్శించారు. ఒకేరోజు భారత్‌ లో అగ్రరాజ్యం పొలిటికల్ బాస్ - మరో దేశం జ్యూడిషియరీ హెడ్ ఉండటం గమనార్హం.

లార్డ్ రాబర్డ్ జాన్ రీడ్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డేతో కలిసి విచారణలో పాల్గొన్నారు. మన దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు ఎలా జరుగుతున్నాయో ఆయన గమనించారు. సుప్రీం కోర్టుకు వచ్చిన రాబర్ట్ జాన్ రీడ్‌ కు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్వాగతం పలికారు. సీజేఐ బాబ్డే పక్కన కూర్చున్నారు.

లార్డ్ రాబర్డ్ జాన్ రీడ్ ఇంటర్నేషనల్ జడ్జెస్ కాన్ఫరెన్స్ 2020లో పాల్గొనేందుకు వచ్చారు. కాగా, యూకే సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రాబర్డ్ జాన్ రీడ్ సీజేఏ బాబ్డేతో కలిసి ఆర్టిబిషన్ వ్యవహారానికి సంబంధించిన కేసును విచారించారు. దేశంలో కేసులు పేరుకుపోతున్న నేపథ్యంలో న్యాయ వివాదాలకు సంబంధించి మధ్యవర్తిత్వం తప్పనిసరి చేయాలనే వాదన కొంతకాలంగా వినిపిస్తోంది.