Begin typing your search above and press return to search.

భారత్ ధర్మసత్రమా ? ప్రతి ముస్లిం కి పౌరసత్వం ఇవ్వాలి అంటే ఎలా ?

By:  Tupaki Desk   |   23 Dec 2019 5:33 AM GMT
భారత్ ధర్మసత్రమా ? ప్రతి ముస్లిం కి పౌరసత్వం ఇవ్వాలి అంటే ఎలా ?
X
గత కొన్ని రోజులుగా భారతదేశం లోని కొన్ని ప్రాంతాల లో ఆందోళనలు తీవ్రమైన ఉగ్రరూపం దాల్చుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త గా తీసుకొచ్చిన పౌరసత్వ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. పంచంలోని అన్ని దేశాల ముస్లీంలు భారతదేశం లోకి అక్రమంగా ప్రవేశిస్తే ఇక్కడ వారికి ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ధర్మసత్రం కాదని ఆందోళన కారుల పై అసహనం వ్యక్తం చేసారు.

పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా భారత్ ఇరుగు పొరుగు దేశాలకు చెందిన ముస్లీంలు అర్జీ సమర్పిస్తే వారికి భారత్ సౌరసత్వం ఇచ్చే అవకాశం ఉందని, కానీ పౌరసత్వ సవరణ చట్టం బిల్లును వ్యతిరికేస్తూ కొందరు కావాలనే రాజకీయం చేస్తూ ఆందోళనకారులను రెచ్చగొడుతున్నారని జోషి విచారం వ్యక్తం చేశారు.ప్రపంచంలోని ముస్లీంలు అందరికీ ఇక్కడ ఆశ్రమం ఇస్తే భారతదేశంలోని మిగితా మతాలకు చెందిన వారు ఎక్కడికి పోతారని ఆందోళన చేస్తున్న వారిని ప్రశ్నించారు. భారత దేశం లో చట్ట ప్రకారం అందరూ జీవించడానికి హక్కు ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అభిప్రాయం వ్యక్తం చేశారు.

పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బాంగ్లాదేశ్ తదితర దేశాల్లోని కొందరి అరాచకాలకు, హింసకు, అణిచి వేతకు గురైన హిందూ, క్రైస్తవులు, బౌద్దులు, జైన్, సిక్కులు, పార్శీ మతాలకు చెందిన వారికి భారత్ పౌరసత్వం ఇస్తామని జోషి తెలిపారు. ప్రపంచ దేశాల్లోని అందరూ ముస్లీంలకు భారత్ పౌరసత్వం ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషం తేల్చి చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం వలన భారత దేశంలోని ముస్లీంల కు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఎప్పటి లాగే వారు హాయిగా ఇక్కడ ఉండచ్చు అని , కావాలనే కొంతమంది దీన్ని రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు.

ఈ సమయంలోనే 1947లో పాకిస్తాన్ లో హిందువుల సంఖ్య 18.7 శాతం ఉండేదని, ఇప్పుడు కేవలం 1.6 శాతం మంది హిందువులు అక్కడ ఉన్నారని, బాంగ్లాదేశ్ లో సైతం మొదట 22 శాతం హిందువులు ఉంటే ప్రస్తుతం 8.5 శాతం మంది హిందువుల మాత్రమే అక్కడ ఉన్నారని, అఫ్ఘనిస్తాన్ లో 22 వేల మంది హిందువులు, సిక్కులు ఉంటే ప్రస్తుతం 500 మంది మాత్రమే ఉన్నారని ..ఇలా అన్ని దేశాల లోని హిందువులు ఏమై పోయారని ప్రశ్నించారు.పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతికిస్తూ ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి కుళ్లు రాజకీయాలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశ ద్రోహి ఒక దేశ ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు.