జువైనల్ హోమ్ లో 8 మందికి పాజిటివ్ !

Tue Aug 11 2020 14:09:43 GMT+0530 (IST)

Positive for 8 people in a juvenile home!

ఏపీలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిరోజూ కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కరోనా భారిన పడుతూనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకు బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికే పరిమితమైన కరోనా ఇళ్లల్లో ఉన్నవారిని సైతం సోకుతుంది. అటు జైళ్లలో ఉన్న ఖైదీలకు సైతం పాజిటివ్ గా తేలుతుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు శనివారపుపేటలోని జువైనల్ హోమ్ లో కరోనా అలజడి సృష్టించింది.జువైనల్ హోమ్ లో ఉంటున్న ఎనిమిది మంది బాలురకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ  అయింది అని అధికారులు తెలిపారు. దీంతో వారిని చికిత్స కోసం వెంటనే ఏలూరు సీఆర్ రెడ్డి పాలిటెక్నిక్ కోవిడ్ కేర్ సెంటర్ కు తరలించారు. తొలుత హోమ్ సూపరింటెండెంట్ కు తరువాత ఒక టీచర్ కు కరోనా సోకిందని… వారి నుంచి బాలురకు సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వీధి బాలురు చిన్న చిన్న నేరాలకు పాల్పడేవారికి జువైనల్ హోమ్‌లో వసతి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 8 మందికి పాజిటివ్ గా తేలడంతో  జువైనల్ హోమ్ ను పూర్తి శానిటైజ్ చేసిన అధికారులు అందులో ఉన్న పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేయిస్తామని అధికారులు తెలిపారు.