Begin typing your search above and press return to search.

పాపం రాజగోపాల్ ... అనుకున్నదొకటి, అయినదొకటి?

By:  Tupaki Desk   |   1 Oct 2022 5:23 AM GMT
పాపం రాజగోపాల్ ... అనుకున్నదొకటి, అయినదొకటి?
X
ఏ ముహూర్తంలో కాంగ్రెస్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరారో అప్పటి నుండి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో తనదే గెలుపని రాజగోపాల్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు చెబుతున్నా వాస్తవానికి అంత సీన్ లేదనే అనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయలేక కోమటిరెడ్డి బ్రదర్స్ లో తమ్ముడైన రాజగోపాల్ కాంగ్రెస్ లో నుండి బీజేపీలోకి వెళ్ళిపోయారు.

అప్పటినుండి రాజగోపాల్ ను కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి. తాజాగా మర్రిగూడ మండలం బీజేపీ అధ్యక్ష, కార్యదర్శలు చెరుకు శ్రీరాములు, కొత్తమల్లయ్యలు బీజేపీకి రాజీనామా చేసి కారెక్కేశారు. వీళ్ళతో పాటు వీళ్ళ మద్దతుదారుల్లో చాలామంది వెళ్ళిపోయారు.

విషయం ఏమిటంటే కాంగ్రెస్ నుండి తాను రాజీనామా చేసేయగానే తనతో పాటు తన మద్దతుదారులంతా రాజీనామాలు చేసేస్తారని అనుకున్నారు. అయితే ఎవరో కొద్దిమంది మాత్రమే రాజీనామా చేశారు. మరికొంతమంది టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు.

మిగిలిన వాళ్ళంతా ఇంకా కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతున్నారు. వీళ్ళను బీజేపీలోకి రమ్మని ఎంత ఒత్తిడి పెడుతున్నా రావటంలేదు. అంటే తన మద్దతుదారుల్లో ఎక్కువమంది బీజేపీలో చేరకపోవటం ఒక నష్టమైతే బీజేపీలోని నేతలే టీఆర్ఎస్ లోకి వెళిపోవటం మరోనష్టం. ఇదే సమయంలో ఒరిజినల్ కమలం పార్టీ నేతలకు రాజగోపాల్ తో వచ్చిన కొద్ది మంది నేతలకు ఏ మాత్రం పడటం లేదు.

రెండు వర్గాల నేతల మధ్య ఆధిపత్యం గొడవల వల్ల ఒరిజినల్ బీజేపీ నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇవన్నీ సరిపోవన్నట్లుగా రాజగోపాల రెడ్డిని కొన్ని గ్రామాల వాళ్ళు ప్రచారం చేసుకోవటానికే అంగీకరించలేదు. 2018 ఎన్నికల హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఇపుడు ఉప ఎన్నికలో ప్రచారానికి వస్తున్నారంటు రాజగోపల్ పై జనాలు మండిపోతున్నారు. ఇలా అన్ని వైపుల నుండి మాజీ ఎంఎల్ఏకి సమస్యలే ఎదురవుతున్నాయి. దీంతో అసలు రాజగోపాల్ రెడ్డి గెలుస్తారా అన్నది పక్కన పెడితే... రెండో స్థానం అయినా సాధిస్తారా? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.