రెండు బెత్తం దెబ్బలంటూ దిమ్మ తిరిగే ట్వీట్ పంచ్

Sat Dec 07 2019 11:15:15 GMT+0530 (IST)

Poonam Kaur Responce On Encounter

దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన వైనం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై అభినందనలు పెద్ద ఎత్తున వస్తుండగా.. కొందరు మాత్రం జరిగిన తీరు సరికాదంటూ విభేదిస్తున్నారు. ఓవరాల్ గా చూసినప్పుడు సామాన్యుల మొదలు సెలబ్రిటీల వరకూ దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పాజిటివ్ రియాక్ట్ అయ్యారనే చెప్పాలి.ఇలాంటి వేళ.. కొందరు మాత్రం తమదైన ట్వీట్లు వేసి.. మిగిలిన వారి కంటే భిన్నంగా నిలిచారు. అలాంటి కోవకే వస్తారు నటి పూనం కౌర్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. గురి చూసి వదిలే బాణం మాదిరి.. అప్పుడప్పుడు ఆమె కొన్ని విమర్శనాస్త్రాల్ని సంధిస్తుంటారు. కాకుంటే చీకట్లో వదిలినట్లుగా అనిపిస్తాయి కానీ కాస్త లోతుగా చూస్తే.. ఆమె భావం ఇట్టే అర్థమయ్యేటట్లు ఉంటుంది.

తాజాగా అలాంటి ట్వీట్ పంచ్ ను తాజాగా సంధించి సంచలనంగా మారారు పూనం. ఎన్ కౌంటర్ తో దిశకు న్యాయం చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి.. పోలీసులకు థ్యాంక్స్ అని పేర్కొన్నారు. అంతేకాదు తనతో పాటు పలువురు మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నేతల్ని శిక్షిస్తారని భావిస్తున్నా అంటూ చేసిన ట్వీట్ లో ఫినిషింగ్ టచ్ ను మాత్రం అండర్ లైన్ చేసి చదువుకోవాల్సిందిగా చెబుతున్నారు.

ఇంతకూ ట్వీట్ చివర్లో విసిరిన పంచ్ చూస్తే.. ప్లీజ్ రెండు బెత్తం దెబ్బలు అంటూ ముక్తాయించారు. ఇంతకీ పూనం కౌర్ చేసిన ఈ ట్వీట్ లో ఉన్న మర్మం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాకుంటే.. తాను పోస్టు చేసిన కాసేపటికే ట్వీట్ ను తొలగించటం గమనార్హం. శిక్షించాలని కోరే ముందు తమకు జరిగిన అన్యాయంపై బాధితులు బలంగా నిలబడాలన్న ప్రాథమిక విషయాన్ని పూనంకౌర్ ఎందుకు మిస్ అవుతున్నట్లు?