Begin typing your search above and press return to search.

క‌రోనా ఎఫెక్ట్‌: 70 ఏళ్ల కాలుష్యం త‌గ్గుముఖం

By:  Tupaki Desk   |   9 April 2020 6:30 AM GMT
క‌రోనా ఎఫెక్ట్‌: 70 ఏళ్ల కాలుష్యం త‌గ్గుముఖం
X
క‌రోనా వైర‌స్ ఎంత‌గా ప్ర‌బ‌లుతుంటే అంతగా భూగోళానికి మేలు చేస్తోంది. మాన‌వ స‌మాజంతో భూగోళంలో విప‌రీత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భూతాపం భారీగా పెరిగిపోయి వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోతున్న స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ మాన‌వ‌జాతిపై తీవ్ర ప్ర‌భావం చూపింది. ఆ క‌రోనా వైర‌స్‌కు భ‌య‌ప‌డి ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. త‌న మేధాశ‌క్తితో భూగ‌ర్భం నుంచి ఆకాశం వ‌ర‌కు అనేక ఆవిష్క‌ర‌ణ‌లు చేశాడు. అంత‌టి మేధావిని భ‌య‌పెట్టి ఇంట్లో కూర్చోపెట్టిన ఘ‌న‌త ఒక్క క‌రోనా వైర‌స్‌ కే ద‌క్కింది. ఈ వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో దాదాపు ప్ర‌పంచంలోని చాలా దేశాలు లాక్‌ డౌన్ ప్ర‌క‌టించుకున్నాయి. ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో భూగోళానికి చాలా మేలు చేసింది. ఈ క్ర‌మంలో దాదాపు 70 ఏళ్ల నాటి కాలుష్యం త‌గ్గింద‌ని ప‌లు సంస్థ‌లు వెల్ల‌డిస్తున్నాయి.

వాస్త‌వంగా 1939 నుంచి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ సమయంలో ప్రపంచంలో అత్యధిక కాలుష్యం నమోదైంది. ఆ తరువాత కొన్నాళ్ల వరకు ఆ కాలుష్యం కొన‌సాగుతూనే ఉండ‌గా మ‌ధ్య‌లో కొన్ని ప‌రిణామాలు జ‌రిగి త‌గ్గుముఖం ప‌ట్టింది. అయితే ప‌రిశ్ర‌మ‌లు పెరిగిపోవ‌డం.. వాహ‌నాల రాక‌పోక‌లు భారీగా ఉండ‌డంతో మ‌ళ్లీ కాలుష్యం పెరిగిపోయింది. పరిశ్రమలు - వాహ‌నాల నుంచి గాలిలోకి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ భారీగా పెరిగిపోయింది. అలాంటి కాలుష్యం ఇప్పుడు లాక్‌ డౌన్ వ‌ల‌న పూర్తిగా త‌గ్గిపోతోందంట‌.

జనవరి 2020 నుంచి ప్రపంచంలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ క్ర‌మంలో మాన‌వ ప్ర‌పంచం గ‌జ‌గ‌జ వ‌ణుకుతోంది. ఈ క్ర‌మంలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం దాదాపుగా 182 దేశాలు పాక్షికంగా లాక్‌ డౌన్ చేశాయి. వీటిలో ప్రధాన దేశాలు పూర్తిగా లాక్‌ డౌన్ ప్ర‌క‌టించాయి. దీంతో ప‌రిశ్ర‌మ‌లు కూడా మూత‌ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో కార్బన్ డై ఆక్సైడ్‌ ను అధికంగా విడుదల చేసే పరిశ్రమలు మూతపడ‌డం - విమానాల రాకపోకల నిలుపుద‌ల‌ - వాహనాల రాక‌పోక‌ల‌పై నిషేధం వంటి వాటితో కార్బ‌న్ డై ఆక్సైడ్ చాలా వ‌ర‌కు క‌నిపించ‌డం లేదంట‌. 70 ఏళ్లుగా పెరిగిపోతున్న కాలుష్యం ఈ జనవరి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిందని ప‌ర్యావ‌ర‌ణవేత్త‌లు - ప‌లు సంస్థ‌లు వెల్ల‌డిస్తున్నాయి.

భార‌త‌దేశంతోపాటు అనేక దేశాల్లోని వాతావరణంలో కార్బైన్ డై ఆక్సైడ్ గణనీయంగా తగ్గిపోయిందంట‌. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5 శాతం మేర కార్బన్ డై ఆక్సైడ్ తగ్గిపోయినట్టు పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మరో రెండు నెలలు ఇలాంటి పరిస్థితులే కొన‌సాగితే మాత్రం భూగోళానికి ఎంతో మేలు ఉంటుందంట‌. కనీసం 20శాతం మేర కార్బన్ డై ఆక్సైడ్ వాతావరణంలో తగ్గిపోయి మంచి వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుందని స‌మాచారం. కార్బ‌న్ డై ఆక్సైడ్ త‌గ్గిపోయి ఆక్సిజన్ శాతం మెరుగుపడుతుందని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విధంగా క‌రోనా వైర‌స్ భూగోళానికి ఎంతో దోహ‌దం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.