గోదావరి జిల్లాల్లో పొలిటికల్ సైలెన్స్.. పార్టీలకు దడదడ...!

Tue Jan 24 2023 09:02:02 GMT+0530 (India Standard Time)

Political silence in Godavari districts

ఉభయ గోదావరి జిల్లాలు అంటే.. రాజకీయాలకు సై! అనే టైపులో ఉంటారు. రాజకీయాల గురించే ఏ ఇద్ద రు కలిసినా మాట్లాడుకుంటారు. అయితే.. అలాంటి రెండు ఉమ్మడి జిల్లాల్లోనూ ఇప్పుడు సైలెంట్ పాలిటి క్స్ తెరమీదికి వచ్చాయి. ఎవరూ కూడా రాజకీయాల గురించి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎవరూ కూడా పెదవి విప్పడం లేదు. మరోవైపు.. కీలక రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ ఎలాంటి సభలు సమావేశాలు పెట్టలేదు.దీనికితోడు కీలక నేతలుగా.. వైసీపీలో ఉన్నవారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టీడీపీలో కొందరు నాయ కులు మాకెందుకులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు. తమ తమ వ్యాపారాలు వ్యవహారాల్లో మునిగిపోయారు. ఒకరిద్దరు లేదా..పట్టుమని పది మంది లోపే.. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి రాజకీయ మౌనాన్ని తలపిస్తోంది.

అదేసమయంలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తానని.. అధికారంలోకి వచ్చేది మనమేనని.. గతంలో ప్రకటిం చినప్పుడు మాత్రం కొంత ఊపు కనిపించింది. అయితే.. ఇటీవల శ్రీకాకుళంలోని  రణస్థలంలో పవన్ కళ్యాణ్ సభ పెట్టి.. తన వాదన వినిపించారు. ప్రజలు తన వెంట లేరని.. అందుకే.. తాను ఒంటరిగా పోటీ చేసి.. వీర మరణం పొందలేనని అన్నారు. ఈ వ్యాఖ్యల అనంతరం.. ఉభయగోదావరి జిల్లాల్లోని కాపు క్షత్రియ సామాజిక వర్గం కూడా మౌనంగా ఉంటున్నారు.

అంటే.. వారు కోరుకుంటున్న విధంగా లేదా.. వారు ఆశిస్తున్న విధంగా రాజకీయాలు లేవని అనుకుంటు న్నారో.. లేక ఇప్పుడున్న రాజకీయాలను మార్చాలని భావిస్తున్నారో తెలియదు కానీ.. ప్రస్తుతం మాత్రం ఒక స్తబ్దత కనిపిస్తోంది. అటు వైసీపీలోని నాయకులు కూడా తమ పనితాను చేసుకుని పోతున్నారే తప్ప.. ఎక్కడా రియాక్ట్ కావడం లేదు. గతంలో మాదిరిగా ఇప్పుడు సవాళ్లు కూడా వినిపించడం లేదు. ఇదీ.. సంగతి!!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.