Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో పొలిటిక‌ల్‌ చెడుగుడు.. మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   7 Dec 2022 9:30 AM GMT
తెలంగాణ‌లో పొలిటిక‌ల్‌ చెడుగుడు.. మామూలుగా లేదుగా!
X
రెండు బ‌ల‌మైన పార్టీలు.. రెండు బ‌ల‌మైన శ‌క్తులు రాజ‌కీయాల్లో కొట్టాడితే ఎలా ఉంట‌ది? అంటే.. తెలంగాణ‌లో ఉన్న రాజ‌కీయం మాదిరిగానే ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జాతీయ‌స్థాయిలో బ‌లంగా ఉన్న బీజేపీ తెలంగాణ‌లో అధికారంలోకి వ చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక‌, తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు యుద్ధ స‌న్నాహా లు చేస్తోంది. అయితే, ఇక్క‌డ లొల్లి ఏంటంటే.. కొడితే కుంభ‌స్థ‌లం కొట్టాల‌న్న‌ట్టుగా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆస‌క్తిగామారింది.

తెలంగాణ‌లో ఎవ‌రు కాద‌న్నా.. ఔన‌న్నా.. కేసీఆర్ దూకుడు ఓ రేంజ్‌లో ఉంది. ఆయ‌నను వ్య‌తిరేకించే వ‌ర్గాలు కూడా ఆయ‌న రాజ‌కీయాల‌ను వ్య‌తిరేకించేప‌రిస్థితి లేదు. ప్ర‌జ‌ల్లో ఉన్న సెంటిమెంటు కావొచ్చు.. ఆయ‌న చెప్పే మాట‌లు కావొచ్చు.. మొత్తంగా కేసీఆర్ ఒక బ‌ల‌మైన శ‌క్తి. దీనిని గుర్తించిన బీజేపీ ఆయ‌న‌ను ఓడిస్తే త‌ప్ప త‌మ ప్ర‌భావం పండ‌ద‌ని లెక్క‌లు వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే.. ఆయ‌న‌పై ప‌దునైన అస్త్రాన్ని ప్ర‌యోగించేలా వ్యూహాత్మ‌కంగా చ‌క్రం తిప్పుతున్న‌ట్టు తెలుస్తోంది.

బీజేపీ లో సంస్థాగ‌తంగా ఉన్న నాయ‌కుల క‌న్నా.. టీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగే నాయ‌కుడు, పైగా బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు అయితే బ‌లంగా ఢీకొట్టే అవ‌కాశం ఉంటుంద‌ని బీజేపీ అధిష్టానం స‌హా ప్ర‌ధాని మోడీ లెక్కులు వేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌కు ప్రియ‌మైన శ‌తృవుగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్‌ను రంగంలోకి దింపుతున్నార‌ని ఢిల్లీ బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న‌తో ఇప్ప‌టికే చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయ‌ని స‌మాచారం.

కేసీఆర్ ఎక్క‌డ నుంచి పోటీ చేసినా ఈట‌ల అక్క‌డ రంగంలోకి దిగేలా బీజేపీ పెద్ద వ్యూహ‌మే సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం కేసీఆర్ త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇది బీజేపీ నేత‌లే చేయిస్తున్న ప్ర‌చారంగా టీఆర్ ఎస్ భావిస్తోంది. త‌ద్వారా..

కేసీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లను దృష్టి మ‌రిల్చి.. కేసీఆర్‌పై ఉన్న అంచ‌నాలు అంతో ఇంతో త‌గ్గించి.. ఎన్నిక‌ల స‌మ‌యానికి త‌మ పంట పండించుకునేందుకు క‌మ‌లనాథులు స్కెచ్ సిద్ధం చేసుకున్నార‌ని అంటున్నారు. ఇక‌, బీజేపీని బ‌లంగా ఎదుర్కొనేందుకు కేసీఆర్ సైతం సిద్ధం కాకుండా ఉంటారా? అందుకే, తెలంగాణ‌లో పొలిటిక‌ల్ చెడుగుడు ప్రారంభ‌మైంద‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.