ఎన్నికలు లేకుండానే ప్రజల వద్దకు పార్టీలు.. ఏపీలో నయా సీన్..!

Thu Nov 25 2021 10:00:02 GMT+0530 (IST)

Political Parties In Andhrapradesh

ఏపీలో రాజకీయ పరిణామాలు వడివడిగా మారుతున్నాయి. కేవలం నాలుగు రోజలు వ్యవధిలో అధికార వైసీపీ ప్రతిపక్షం టీడీపీ తీసుకున్న నిర్ణయాలు.. రాష్ట్రాన్ని మరోసారి సంచలనం చేశాయి. ఈ రెండు పార్టీలూ.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు కూడా లేని సమయంలో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలోనే ప్రకటించారు. తాము తీసుకువచ్చిన మూడు రాజధానులపై టెక్నికల్ సమస్యలు వస్తున్న నేపథ్యంలో వాటిని వెనక్కి తీసుకుని.. ప్రజల్లోకివెళ్లి.. సమగ్ర చట్టాలను రూపొందిస్తామని.. చెప్పారు. ఇదే విషయంపై జగన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు.ప్రజల అభిప్రాయం చూసుకుని.. వారి అభిప్రాయం మేరకు రాజధానులపై నిర్ణయం తీసుకుంటామని జగన్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగియగానే.. ఎమ్మె ల్యేలు. మంత్రులు.. ప్రజాప్రతినిధులు.. అందరూ ప్రతి నియోజకవర్గంలోనూ.. ప్రతి ఇంటికీ వెళ్లనున్నా రు. వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. దీనిని బట్టి.. రాజధానులపై నిర్ణయం తీసుకుంటారు.

సో.. వైసీపీ నాయకులు నిన్న మొన్నటి వరకు స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు.. మరోసారి మూడు రాజధానుల నేపథ్యంలో వారు మరోసారి ప్రజల సమక్షంలోకి వెళ్లనున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా ప్రజల్లోకి వెళ్లనుంది. ఇప్పటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మేరకు.. ఇటీవల శుక్రవారం అసెంబ్లీలో జరిగిన అవమానకర ఘటనను ప్రజల్లోకి తీసుకువెళ్లి సానుభూతి పొందాలని.. చంద్రబాబు భావించారు. ఆయన అనుకూల మీడియా కూడా ఇదేసలహా ఇచ్చిందనే ప్రచారం ఉంది.

సో.. ప్రస్తుతం రాష్ట్రంలో వరదలు.. వర్షాలు తగ్గిన తర్వాత.. టీడీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అయితే.. ఇప్పుడు మారిన వైసీపీ వ్యూహం నేపథ్యంలో ఏ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని.. టీడీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. మొత్తానికి ప్రజల్లోకి వెళ్లడం అయితేఖాయంగా కనిపిస్తోంది. సో..ఈ పరిణామాలను గమనిస్తే.. మళ్లీ.. ఎన్నికలు లేకుండానే ప్రజల వద్దకు పార్టీలు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. మరి ప్రజాతీర్పు ఎలా ఉంటుందో చూడాలి.