Begin typing your search above and press return to search.

ఏపీ ప‌రిణామాలు..గూగుల్ సెర్చ్‌ లో స‌రికొత్త ప‌రిణామాలు..ఏంటంటే!

By:  Tupaki Desk   |   24 Jan 2021 3:59 AM GMT
ఏపీ ప‌రిణామాలు..గూగుల్ సెర్చ్‌ లో స‌రికొత్త ప‌రిణామాలు..ఏంటంటే!
X
ఏపీలో చోటు చేసుకున్న వ్య‌వ‌హారంపై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు జోక్యం చేసుకుంటుందా? ఒక‌వేళ అదే జ‌రిగితే.. త‌ర్వాత ప‌రిణామాలు ఎటు దారితీస్తాయి? ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి ప‌రిణామం ఎక్క‌డైనా జ‌రిగిందా? జ‌రిగితే.. చివ‌రికి ఏమైంది? -ఇదీ.. శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి రాత్రి పొద్దు పోయే వ‌ర‌కు గూగుల్‌ లో జ‌రిగిన భారీ సెర్చ్‌!! అవును. ఏపీలో ఏర్ప‌డిన ప‌రిణామాల‌పై మేధావుల నుంచి ఉద్యోగుల వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ ఇంట్ర‌స్ట్ చూపించారు. అస‌లు ఇలాంటి ప‌రిణామాలు గ‌తంలో ఎక్క‌డైనా జ‌రిగాయా? అని విప‌రీతంగా సెర్చ్ చేశారు.

ప్ర‌స్తుతం అర‌చేతిలో ఆన్‌ లైన్ సౌక‌ర్యం ఉండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రూ చేతి వేళ్ల‌తో ఏపీలో చోటు చేసుకున్న ప్ర‌భుత్వం వ‌ర్సెస్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ మ‌ధ్య నెల‌కొన్న వివాదంపై ఆస‌క్తి చూపించారు. ఎక్కువ మంది సెర్చ్ చేసింది ఏంటంటే.. భార‌త రాజ్యాంగంలో ఆర్టిక‌ల్ 234 కె-గురించే. ఇది రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌ - దాని విధులు - బాధ్య‌త‌లు - అధికారాలు.. తెలియ‌జేస్తుంది. ప్ర‌స్తుతం ఏపీలో ప్ర‌భుత్వం ఎన్నిక‌లు నిర్వహించ‌లేమ‌ని చెప్పింది. అయితే.. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎన్నిక‌లు పెడ‌తామ‌ని క‌మిష‌న‌ర్ చెప్పారు. ఈ క్ర‌మంలోనే నోటిఫికేష‌న్ కూడా ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి నోట విన్నా.. రాజ్యాంగం - ఆర్టిక‌ల్ 234 కె- గురించే చ‌ర్చ జ‌రిగింది.

దీంతో ఈ ఆర్టిక‌ల్ గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది సెర్చ్ చేశారు. త‌ర్వాత రాజ్యాంగంలోని 73 - 74 ఆర్టిక‌ల్స్ స‌వ‌ర‌ణ‌ల గురించి ఎక్కువ మంది శోధించారు. ఇవి రెండూ కూడా స్థానిక ఎన్నిక‌ల కు సంబంధించి స‌వ‌ర‌ణ ఆర్టిక‌ల్స్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ రెండింటితో పాటు.. ప్ర‌భుత్వ విధులు - గ‌వ‌ర్న‌ర్ విధుల‌ను కూడా ఈ స‌మ‌యంలో ఎక్కువ మంది శోధించారు. అదేవిధంగా ఇలాంటి ప‌రిస్థితి దేశంలో గ‌తంలో ఎక్క‌డైనా వ‌చ్చిందా? వ‌స్తే.. అలాంటి స‌మ‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు? అనే విష‌యాలు తెలుసుకునేందుకు ఆస‌క్తి చూపించారు. మ‌రోవైపు.. ఈ వివాదంలో కేంద్రం జోక్యం చేసుకుంటే.. అనే ప్ర‌శ్న‌లు.. ప్ర‌తి ఒక్క‌రూ సంధించారు. ఇలా శ‌నివారం అంతా .. రోజు వారీ గూగుల్ వినియోగంలో స‌రికొత్త ట్రెండ్ సృష్టించిన‌ట్టు తెలుస్తోంది.