Begin typing your search above and press return to search.

‘నార‌ప్ప‌’ను లైన్లోకి తీసుకున్న పోలీసులు.. హెచ్చ‌రిక‌ జారీ!

By:  Tupaki Desk   |   23 July 2021 3:30 PM GMT
‘నార‌ప్ప‌’ను లైన్లోకి తీసుకున్న పోలీసులు.. హెచ్చ‌రిక‌ జారీ!
X
రోడ్డు భ‌ద్ర‌త..సైబర్ జాగ్రత్త.. కరోనా హెచ్చరిక.. అంశం ఏదైనా సినిమా వాళ్ల‌ను విప‌రీతంగా వాడేస్తున్నారు పోలీసులు. అవును మ‌రి, సినిమా న‌టీన‌టులంటే జ‌నాల‌కు తెగ మోజు. అందుకే.. వాళ్ల భాష‌లోనే చెబితే అర్థం చేసుకుంటార‌ని, వాళ్ల దారిలోనే వెళ్లి జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు.

గ‌తంలో రోడ్డు భ‌ద్ర‌త‌, క‌రోనా జాగ్ర‌త్త‌ల విష‌యంలో పోలీసులు ప‌లు విధాలుగా అవ‌గాహ‌న క‌ల్పించారు. కొంద‌రు పూలు చేతికిచ్చి జాగ్ర‌త్త‌లు చెబితే.. మ‌రికొంద‌రు న‌మ‌స్కారాలు పెట్టి ర‌క్ష‌ణ విష‌యం గుర్తుచేశారు. అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు మార‌నే మార‌రు క‌దా! అందుకే.. త‌మ ప్రచారం విభిన్న ప‌ద్ధ‌తుల్లో కొన‌సాగిస్తున్నారు. తాజాగా.. మోస్ట్ పాపుల‌ర్ మెథ‌డ్‌ మీమ్స్ ను ఉప‌యోగిస్తున్నారు.

హెల్మెట్ లేక‌పోతే వాహ‌న‌దారుల‌కు, మాస్కు లేక‌పోతే అంద‌రికీ.. ఎంత ప్ర‌మాదం జ‌రుగుతుందో సెటైరిక‌ల్ గా గుర్తు చేస్తూ అందరినీ ఆక‌ర్షిస్తున్నారు. మీమ్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా మారాయో అంద‌రికీ తెలిసిందే. చెప్పాల‌నుకున్న విష‌యాన్ని రెండు మూడు వాక్యాల్లో ఎఫెక్టివ్ గా చెప్పేస్తున్నారు. దీంతో.. పోలీసులు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఆ మ‌ధ్య‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్ బాబు, ర‌వితేజ‌, నాని త‌దిత‌రుల చిత్రాల‌తో రోడ్డు భ‌ద్ర‌త‌కు సంబంధించిన మీమ్స్ త‌యారు చేసి వ‌దిలారు. అవి ఫుల్ వైర‌ల్ అయ్యాయి.

ఆ మ‌ధ్య టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ డ‌కౌట్ ను కూడా ఇదే కోణంలో ఉప‌యోగించుకున్నారు ఉత్త‌రాఖండ్ పోలీసులు. ''హెల్మెట్ పెట్టుకోవడం ఒక్కటే కాదు.. బాధ్యతాయుతంగా ఉండాలి. అప్పుడే ఇలాంటి ప్ర‌మాదాలు చోటు చేసుకోవు. అలాకాకుండా నిర్ల‌క్ష్యంగా ఉన్నారంటే.. కోహ్లీ మాదిరిగానే జీవితంలోనూ డ‌కౌట్ అవుతారు'' అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం వైర‌ల్ అయ్యింది.

తాజాగా.. క‌రోనాపై అవ‌గాహ‌న కోసం వెంక‌టేష్ లేటెస్ట్ మూవీ 'నార‌ప్ప‌'ను లైన్లోకి తీసుకున్నారు. నారప్ప సినిమాలో ఎండింగ్ డైలాగ్ ను ఇందుకోసం వాడారు సైబ‌రాబాద్ పోలీసులు. సినిమాలో నార‌ప్ప‌.. త‌న చిన్న కుమారుడికి జీవితంలో చ‌దువు ఎంత ముఖ్య‌మో చెబుతాడు. ఈ సన్నివేశానికి సంబంధించిన నారప్ప పిక్ ను తీసుకొని, వెంకీ ముఖానికి మాస్కు తగిలించారు. దానికి క్యాప్ష‌న్ ఇలా రాశారు...

'' ఒక్క విష‌యం చెబుతాను బాగా గుర్తు పెట్టుకుకో సిన్న‌ప్పా.. మాస్కు పెట్టుకో సిన్న‌ప్పా. క‌రోనా ఇంకా ముగిసిపోలేదు'' అని మీమ్ క్రియేట్ సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. దీంతో.. ఇది నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ర్షిస్తోంది. ఈ మీమ్ ఫుల్ వైర‌ల్ అయ్యింది. విష‌యాన్ని సూటిగా, సుత్తిలేకుండా చెప్పే ఈ విధానం ఎంతో బాగుంద‌ని పోలీసుల‌ను ప్ర‌శంసిస్తున్నారు.