Begin typing your search above and press return to search.

బెంగ‌ళూరు సెంట్ర‌ల్‌ జైల్లో ఇన్ని దారుణాలా...

By:  Tupaki Desk   |   9 Oct 2019 3:41 PM GMT
బెంగ‌ళూరు సెంట్ర‌ల్‌ జైల్లో ఇన్ని దారుణాలా...
X
డేగ‌ల్లా ఉండే సీసీ కెమేరాలు... చీమ చిటుక్కుమ‌న్నా వ‌చ్చేసే సెక్యూరిటీ... క‌ళ్లు మూసి తెరిచేలోపు కూడా ఏం జ‌రుగుతుందో ప‌సిగ‌ట్టే భ‌ద్ర‌తా వ‌ల‌యం ఇవ‌న్నీ ఉన్నా కూడా ఓ సెంట్ర‌ల్ జైల్లోకి సిమ్‌ లు - గంజాయి - క‌త్తులు వెళుతున్నాయంటే ఆ జైలులో మేనేజింగ్ ఎలా జ‌రుగుతుందో ఇట్టే చెప్పేయొచ్చు.

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు (బెంగళూరు సెంట్రల్ జైలు)లో ఎంత ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఉంటుందో తెలిసిందే. అయితే అదే జైలు ఇప్పుడు అరాచ‌క వాదుల‌తో నిండిపోయి.. అక్ర‌మాల‌కు అడ్డాగా మారిపోయింది.

ఈ విష‌యం తెలుసుకున్న బెంగళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు చేసిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెల్ల‌డ‌య్యాయి. పోలీసులు ముంద‌స్తు స‌మాచారంతో చేసిన దాడుల్లో ప్ర‌తి ఖైదీ బ్యార‌క్‌ తో పాటు ఖైదీని అణువ‌ణువు త‌నిఖీ చేశారు. మొత్తం 37 సిమ్ కార్డులు - తల్వార్లు - మారణాయుధాలు - గంజాయి - గంజాయి సేవించే పొగగొట్టాలు - సెల్‌ ఫోన్ లతో పాటు ప‌లు నిషేధిత వ‌స్తువులు స్వాధీనం చేసుకున్నారు.

బెంగ‌ళూరు సెంట్ర‌ల్ జైలులో ఎంతో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉన్నా కూడా ఇన్ని నిషేధిత వ‌స్తువులు లోప‌ల‌కు వెళ్ల‌డంతో ఖ‌చ్చితంగా జైలు అధికారుల హ‌స్తం ఉంద‌ని పోలీసులు భావిస్తున్నారు. వీరు లంచాల‌కు రుచిమ‌రిగే ఖైదీల‌కు ఇలాంటి సేవ‌లు అందిస్తున్నార‌న్న అనుమానాలు వ‌స్తున్నాయి. జైలు అధికారుల తీరుపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త స‌మ్మ‌ర్‌ లో సీసీబీ పోలీసుల దాడుల్లోనూ నిషేధిత వ‌స్తువులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు పోలీసులు జైలు అధికారుల‌కు హెచ్చిరిక‌ల‌తో స‌రిపెట్టారు.

ఇక ఇప్పుడు మ‌రోసారి ఖైదీల ద‌గ్గ‌ర‌ - బ్యార‌క్‌ ల‌లో నిషేధిత వ‌స్తువులు ఉండ‌డంతో ఈ సారి జైల్ అధికారుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు ఉంటాయో ? చూడాలి. ఖైదీలు నిత్యం వేసుకునే దుస్తులో మొబైల్ సిమ్ కార్డులు దాచి పెట్టుకున్నారని వెలుగు చూసింది. ఇక ఇదే జైలులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే. జయలలిత ప్రాణస్నేహితురాలు వీకే. శశికళ కూడా శిక్ష అనుభ‌విస్తోన్న సంగ‌తి తెలిసిందే.