Begin typing your search above and press return to search.

పోలీస్ ఎన్ కౌంటర్ల తరువాత జరిగే పరిణామాలు..పూర్తి విశ్లేషణ!

By:  Tupaki Desk   |   7 Dec 2019 5:30 PM GMT
పోలీస్ ఎన్ కౌంటర్ల తరువాత జరిగే పరిణామాలు..పూర్తి విశ్లేషణ!
X
ఎన్ కౌంటర్ ..చేయడం చాలా చిన్న విషయమే. కానీ , దాని తరువాత జరిగే పరిణామాలు చాలా పెద్దగా ఉంటాయి. ఏమాత్రం పొరపాటు చేసినా కూడా ఆ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసుల జీవితాలు ఒక్క క్షణం లో తారుమారు అవుతాయి. ఇప్పటికే ఈ దేశంలో ఆలా ఎన్ కౌంటర్ల లో పాల్గొని ..కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారు చాలామంది ఉన్నారు. తక్షణ న్యాయం కోసం భాదితుల కుటుంబాలు ..వెంటనే నిందుతులని ఎన్ కౌంటర్ చేసి పడేయాలని చెప్పినా ..అవే మాటలని సాక్ష్యాలుగా తీసుకోని ..వారిని పోలీసులు ఎన్ కౌంటర్లు చేస్తూ పొతే ..ఇక ఈ దేశంలో ఉన్న కోర్టుల పై - న్యాయ వ్యవస్థ పై ఉన్న కొంచెం నమ్మకం కూడా పోతుంది. అలాగని ఎన్ కౌంటర్లు తప్పు కాదు.. ఘోరాలు చేసిన వారిని హాయిగా జైల్లో పెట్టి మూడు పూటలా అన్నం పెట్టి మాపాల్సిన అవసరం లేదు. కానీ , దానికంటూ ఒక ప్రోసెస్ ఉంటుంది.

అసలు ఎన్ కౌంటర్లు సమర్థనీయమేనా ? దీనిపై - న్యాయవ్యవస్థ, కోర్టులు ఏమంటున్నాయి ? ఒకసారి ఈ ఎన్ కౌంటర్ల పై పూర్తి గా తెలుసుకుందాం ...

పోలీసులు ఎన్ కౌంటర్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ అంశాన్ని మర్డర్ కేసు కింద పరిగణించాల్సి ఉంటుంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశానికి ఈ కమిషన్ సభ్యులు వెళ్లి , విచారణ చేయాల్సి ఉంటుంది. ఆ విచారణ లో భాగంగా .. ఆత్మరక్షణ కోసమే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు సాక్ష్యాలని చూపించలేకపోతే .. సంబంధిత పోలీసు అధికారులను కోర్టులు ప్రాసిక్యూట్ చేయవచ్చు. అలాగే మెజిస్టీరియల్ విచారణకు న్యాయస్థానాలు ఆదేశించవచ్చు. ఒక్కోసారి పోలిసుల పై కూడా జ్యూడిషియల్ విచారణ జరిగే అవకాశం ఉంది. సుప్రీం కోర్టు గానీ - హైకోర్టు లేదా జాతీయ మానవ హక్కుల సంఘం గానీ విచారణకు ఆదేశాలు ఇస్తాయి. ఒకవేళ ఈ ప్రభుత్వం ఈ కేసుని పక్కన పెట్టినా ..అయిదేళ్ల తరువాత అధికారంలోకి వచ్ఛే మరో ప్రభుత్వం ఇలాంటి కేసులను రీ ఓపెన్ చేయవచ్చు.

ఇకపోతే ఈ సమాజంలో అమ్మాయి పై అఘాత్యానికి పాల్పడటం అనేది చాలా నేరం. శిక్షలు వేయడం లో కోర్టులు జాప్యం చేయడంతో ఇలాంటి కేసులు ఎక్కువగా జరుగుతున్నాయి. అత్యాచారమన్నది ఒక మహిళ మౌలిక హక్కులపై జరిగే ఘోర నేరమని - రాజ్యాంగంలోని 21 వ అధికరణం ప్రకారం.. వారి జీవన హక్కును - వ్యక్తిగత స్వేఛ్చను అతిక్రమించే కిరాతకమని సుప్రీంకోర్టు చాలాసార్లు స్పష్టం చేసింది. భారత ప్రభుత్వ వెబ్ సైట్ వెలువరించిన డేటా ప్రకారం.. ప్రతి ఏడాదీ అత్యాచార కేసులు పెరిగిపోతున్నాయి. గత 15 ఏళ్లలో దేశంలో 3లక్షల 41 వేల 400 కు పైగా రేప్ కేసులు నమోదయ్యాయి. కానీ , దోషులుగా తేలినప్పటికీ వారికీ శిక్షలు వేయడంలో కోర్టు వెనకడుగు వేస్తుంది.

మొత్తంగా నిందితులకు శిక్షలు అమలు చేయడంలో మన కోర్టులు అలసత్వం వహించడం బాధాకరం. దీనితోనే ఈ మధ్య కొన్ని కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ అధికారులు - కోర్టులు - ప్రజాప్రతినిధులు కూడా ఈ విధమైన కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. బాధితురాలి కుటుంబం ఫిర్యాదు చేయడానికి వఛ్చినప్పుడు సంబంధిత పోలీసు అధికారి వెంటనే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలి. అలా చేయకపోవడం వల్లే తాజాగా జీరో ఎఫ్ ఐ ఆర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ పని ఇన్ని రోజుల్లోగా చేయాలని టార్గెట్ పెట్టె ప్రభుత్వం ...కోర్టుకి కూడా పాలనా కేసు ఇన్ని రోజుల్లో విచారణ పూర్తి చేసి ..దోషులకు శిక్ష అమలు చేయాలని టార్గెట్ పెట్టాలి. అప్పుడే భాదితులకు సరైన నాయ్యం జరుగుతుంది. దీనికి ఉదాహరణే ..ఢిల్లీ లో జరిగిన నిర్భయ ఉదంతం ..ఆమె పై చట్టం తీసుకువచ్చినా ..ఏడేళ్లు గడుస్తున్నా కూడా ఇప్పటికి ఈ కేసులోని దోషులని జైళ్లల్లో పెట్టి మేపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలపై జరిగే ఘోరాలని ఆపాలి అంటే , ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం చాలా ఉంది. మొత్తంగా మన న్యాయవ్యవస్థలో మార్పు రానంతకాలం ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది.