Begin typing your search above and press return to search.

ఊగుతున్న కారులో ఆ జంటకు ఫైన్ వేసి షాకిచ్చిన పోలీసులు

By:  Tupaki Desk   |   5 March 2021 4:41 AM GMT
ఊగుతున్న కారులో ఆ జంటకు ఫైన్ వేసి షాకిచ్చిన పోలీసులు
X
ఎంజాయ్ చేయటానికి ఎన్నో ప్లేసులు ఉన్నప్పటికి.. బహిరంగ ప్రదేశంలో కారును నిలిపి.. అందులో పని కానిచ్చేసే కక్కుర్తిగాళ్లు అక్కడక్కడ కనిపిస్తుంటారు. విదేశాల్లో ఇలాంటివి చాలానే కనిపిస్తాయి. చట్టప్రకారం అది తప్పా? అంటే.. ఒక్కో దేశంలో ఒక్కోలాంటి నిబంధన. తాజాగా అలాంటి ఇబ్బందే ఎదురైన ఆ దేశ పోలీసులు.. ఊహించని రీతిలో కొత్త అంశాన్ని చూపించి భారీ ఫైన్ వేసిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ చోటు చేసుకున్నదంటే..

యూకేలోని డెర్బీలో చోటు చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. ఒక జంట ఎన్నాళ్లకు కలిశారో.. ఎంత ఆత్రంగా ఉన్నారో కానీ.. పబ్లిక్ ప్లేస్ లో కారును నిలిపేసి మరీ పని కానిచ్చేస్తున్నారు. ఒంటి మీద నూలుపోగు లేకుండా తన్మయత్వంతో ఉన్న వారు చుట్టుపక్కల ఏం జరుగుతుందో అస్సలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు.

అలాంటి వేళలో అటుగా వెళుతున్న పోలీసులు.. ఊగుతున్న కారును చూసి అనుమానం వచ్చి ఆగారు. కారులోపల చూస్తే.. ఒక జంట డీప్ రొమాన్సులో ఉంది. విధి ధర్మంలో భాగంగా వారికి అడ్డు తగిలారు. బ్రిటన్ చట్టాల ప్రకారం బహిరంగ పరదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించటం.. లైంగిక సుఖాన్ని పొందటం నేరం. అయితే.. ఆ అంశాన్ని చూపిస్తూ వారికి ఫైన్ వేయని పోలీసులు.. షాకిచ్చేలా కొత్త అంశాన్ని వారికి చూపించారు.

లాక్ డౌన్ వేళలో.. భౌతిక దూరాన్ని పాటించకుండా బహిరంగ ప్రదేశాల్లో అలా ఉండటం ఏమిటంటూ భారీ ఫైన్ వేశారు. వారిద్దరికి చెరో 200 పౌండ్ల చొప్పున జరిమానా విధించారు. మన రూపాయిల్లో చెప్పాలంటే ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున మొత్తం రూ.40వేలు ఫైన్ వేశారు. అదేదో.. స్టార్ హోటల్ కు వెళ్లినా ఇంత కంటే తక్కువే ఖర్చు అయి ఉండేదేమో!