Begin typing your search above and press return to search.

'అంకుల్ ప్లీజ్ .. మా డాడీని కొట్టకండి'

By:  Tupaki Desk   |   2 April 2020 12:10 PM GMT
అంకుల్ ప్లీజ్ .. మా డాడీని కొట్టకండి
X
కరోనా వైరస్ ను అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లాక్ డౌన్ సమయంలో కూడా పోలీసులు - వైద్యులు ప్రాణాలని పనంగా పెట్టి కరోనాకి చికిత్స అందిస్తున్నారు. అయితే , ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ను పట్టించుకోకుండా కొంతమంది రోడ్డుమీదకి వస్తున్నారు. అలాంటివారి పై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. కొన్ని చోట్ల ఖాకీలు ఎవరినీ నొప్పించకుండా కరోనాపై అవగాహన కల్పిస్తుంటే.. మరికొన్ని చోట్ల ప్రజలని ఇష్టం వచ్చినట్టు కొడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

అలాంటి ఘటనే తాజాగా ఒకటి జరిగింది. వనపర్తి జిల్లాలో ఓ తండ్రిని పోలీసులు కొడుతూ ఉంటే..అతని కొడుకు పోలీసులను ” అంకుల్ వద్దు అంకుల్..ప్లీజ్ ఆపండి అంకుల్..మా డాడీ అంకుల్..డాడీ..డాడీ ” అని ఏడుస్తున్న ఒక వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతోంది. పాపం ఆ పిల్లాడు ప్లీజ్ మా డాడీని కొట్టొద్దు..ఆపండి అంకుల్..డాడీ డాడీ అని గొంతు పోయేలా అరుస్తున్నా కూడా పట్టించుకోలేదు. పైగా ఆ పిల్లాడి తల్లిని కూడా పోలీసులు దూషించారు. చెప్పులు వేసుకోవటానికి కూడా అంగీకరించని పోలీసులు పిల్లాడిని - అతడి తండ్రిని జీపులో కుక్కి తీసుకెళ్లిపోయారు.

ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో ..దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. సదరు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇలాంటి పోలీసుల ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. హోమ్‌ మినిష్టర్‌ మహమూద్‌ అలీ - తెలంగాణ డీజీపీలు దయజేసి ఇటువంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోండి. కొద్దిమంది పోలీసుల తిక్క చేష్టల వల్ల వేలాది మంది పోలీసులకు అపఖ్యాతి వస్తోందని " తెలిపారు. చిన్న పిల్లాడు కొట్టొద్దు అంకుల్ అని ఏడుస్తూ బ్రతిమిలాడుతున్నా కూడా కనీసం కొంచెమైనా ఇంగిత జ్ఞానం లేకుండా అమానుషంగా ప్రవర్తించిన ఆ పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని - వారిని సస్పెండ్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.