Begin typing your search above and press return to search.

దిశ కేసు..ద‌ర్యాప్తులో షాకింగ్ విష‌యాలు రివీల్‌

By:  Tupaki Desk   |   5 Dec 2019 9:58 AM GMT
దిశ కేసు..ద‌ర్యాప్తులో షాకింగ్ విష‌యాలు రివీల్‌
X
రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రిని క‌లచి వేయ‌డంతో పాటు తీవ్ర ప్ర‌కంప‌న‌లు రేపిన వెట‌ర్నరీ డాక్ట‌ర్ దిశ హ‌త్య కేసులో తవ్వేకొద్ది కీల‌క విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. న‌లుగురు కీచ‌కులు దిశ‌ను అతి కిరాత‌కంగా హ‌త్యాచారం చేసి చంపేశారు. దేశ‌వ్యాప్తంగాను - అటు పార్ల‌మెంటును దిశ హ‌త్య ఓ కుదుపు కుదిపేయ‌డంతో సైబ‌రాబాద్ పోలీసులు ఈ కేసు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు.

ఈ కేసు చేధించేందుకు మొత్తం ఏడు బృందాలు రంగంలోకి దిగాయి. వీరంతా కీల‌క సాక్ష్యాలు సేక‌రించే ప‌నిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఈ కేసును చేధించ‌డంలో కీల‌కంగా మారిన దిశ సెల్‌ ఫోన్‌ ను నిందితులు పాతిపెట్టిన‌ట్టు క్లూస్ టీం స‌భ్యులు గుర్తించారు. ఈ క్ర‌మంలోనే సంఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌రిన్ని ఆధారాలు ల‌భ్య‌మైన‌ట్టు కూడా స‌మాచారం. దిశ సెల్‌ ఫోన్ కాల్స్ లిస్టు - కాల్స్ రికార్డుల‌ను ఆధారంగా చేసుకుని పోలీసులు ర‌క‌ర‌కాల యాంగిల్స్‌ లో ఈ కేసును ప‌రిశీలిస్తున్నారు.

ముఖ్యంగా ఆమె చివ‌ర్లో శివ అనే నిందితుడితో ఆరు నిమిషాలు ఏం మాట్లాడిందా ? అన్న‌దే స‌స్పెన్స్‌ గా మారింది. స్కూటీ పంక్చ‌ర్ వేయించేందుకు వెళ్లిన అత‌డు రావ‌డం ఆల‌స్యం అవ్వ‌డంతో అత‌డి ఫోన్ నెంబ‌ర్ తీసుకున్న ఆమె ఫోన్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక న‌లుగురు నిందితులను ప్ర‌త్యేకంగా విచారించేందుకు డీసీపీ ప్రకాశ్‌ రెడ్డి నేతృత్వంలో విచారణ బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే.

ఈ బృందం ఇప్పటికే న‌లుగురు నిందితులు అయిన మహ్మద్ ఆరిఫ్‌ - నవీన్ - శివ - చెన్నకేశవులును విచారిస్తోంది. మిగిలిన ఆరుగురు బృందాల్లో ఒక బృందం సాక్ష్యాలు సేక‌రిస్తుండ‌గా.. మ‌రో బృందం ఫోరెన్సిక్ - డీఎన్‌ ఏ ఆధారాలను పరిశీలించనుంది. మిగిలిన వాళ్లు లీగల్ ప్రొసీడింగ్స్ - ప్రత్యక్ష సాక్షుల విచారణ - ఐడెంటిఫికేషన్ పరేడ్ కోసం ప‌ని చేస్తున్నారు.