Begin typing your search above and press return to search.

సమత హత్యాచార ఛార్జిషీటు చూస్తే వణకాల్సిందే

By:  Tupaki Desk   |   15 Dec 2019 4:42 AM GMT
సమత హత్యాచార ఛార్జిషీటు చూస్తే వణకాల్సిందే
X
దిశ హత్యాచారానికి కొద్ది రోజుల ముందే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో సమత (పోలీసులు పేరు మార్చారు) హత్యాచారం కేసుకు సంబంధించిన ఛార్జిషీటును తాజాగా దాఖలు చేశారు. దీనికి సంబంధించిన విశేషాలు తెలిస్తే ఆవేశంతో రక్తం మరిగిపోవటం ఖాయం. ముగ్గురు నిందితులు సమత పట్ల అమానుషంగా వ్యవహరించటమే కాదు.. ఆమె విపరీతమైన బాధతో విలవిలలాడుతున్నా.. కనికరించలేదన్న వైనం బయటకు వచ్చింది.

ఈ కేసులో మొత్తం 44 మంది సాక్ష్యుల్ని చేర్చారు. హత్యాచారం చేసిన నిందితులు కత్తితోనూ.. బండరాయితోనూ ఆమె పట్ల దారుణమైన కర్కశత్వానికి పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. నవంబరు 24న ఈ దారుణ హత్యాచారం జరిగింది. ఈ కేసులో ఏ1 గా షేక్ బాబు.. ఏ2గా షాబుద్దీన్ ఏ3గా షేక్ ముగ్దుమ్ లు ఉన్నారు.

నిందితుల్లో అందరి కంటే చిన్నోడైన షేక్ బాబు బాధితురాలిని తొలుత పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. అందుకు మిగిలిన ఇద్దరు బాధితురాలి కాళ్లు.. చేతులు కదపకుండా పట్టుకొని సహకరించారు. తర్వాత ఇద్దరు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

బాధితురాలిని కదలకుండా షాబుద్దీన్.. మగ్దూమ్ లు పట్టుకుంటే షేక్ బాబు ఆమెపై కత్తితో దాడి చేశారు. బాధతో విలవిలలాడుతున్నా పట్టించుకోకుండా ఆమెపై ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. చేతులు నరికేసిన దుర్మార్గులు అనంతరం బండరాయి మోది ఆమెను దారుణంగా హత్య చేశారు. ఆమెను ప్రాణాలతో వదిలేస్తే.. తమ గురించి చెబుతుందన్న ఉద్దేశంతో చంపేశారు. నిందితుల క్రూరత్వాన్ని కళ్లకు గట్టేలా సాక్ష్యాధారాలతో 96 పేజీల నివేదికను సిద్ధం చేశారు. సోమవారం నుంచి ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించనున్నారు. నిందితుల తరఫున వాదించకూడదని జిల్లా బార్ అసోసియేషన్ తీర్మానించింది.