చనిపోయినా నిందితులను పట్టించిన పోలీస్

Tue Jul 07 2020 23:04:04 GMT+0530 (IST)

Police who took the accused after death

చనిపోతానని తెలిసినా చివరి క్షణంలోనూ ఆ పోలీస్ చూపిన తెగువకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ పోలీస్ కానిస్టేబుల్ సమయ స్ఫూర్తియే ఇప్పుడు అతడిని హత్య చేసిన దుండగులను పట్టించింది.హర్యానాలోని బుటానా పోలీస్ స్టేషన్ సమీపంలో సోనిపట్ జింద్ రోడ్డు పక్కన కొందరు దుండగులు తమ వాహనాన్ని నిలిపి రోడ్డు మీదే మద్యం సేవించసాగారు. కర్ఫ్యూ రోడ్డు మీద తాగుతున్న వీరిని డ్యూటీ నిర్వహిస్తున్న హర్యానా కానిస్టేబుల్స్ రవీందర్ సింగ్ (28) కప్తాన్ సింగ్ (43)లు అడ్డుకున్నారు.

దీంతో రెచ్చిపోయిన మద్యం బాబులు ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ పై విచక్షణరహితంగా దాడి చేసి చంపేశారు. అయితే చనిపోయే ముందు రవీందర్ సింగ్ తన చేతి మీద దుండగుల వాహనం నంబర్ ను నోట్ చేశాడు. ఆ తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు రవీందర్ చేతిమీద ఉన్న రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా దుండగులను గుర్తించి అరెస్ట్ చేశారు.

ఇలా చనిపోయే ముందు కూడా పోలీస్ కానిస్టేబుల్ రవీందర్ చూపిన సమయస్ఫూర్తిని పోలీసులు కొనియాడుతున్నారు.