కేసీఆర్ ఇంట్లో ఒకరి ఆత్మహత్య.. కలకలం

Wed Oct 16 2019 14:53:22 GMT+0530 (IST)

కేసీఆర్ ఇంట్లో ఆత్మహత్య కలకలం రేపింది. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య సంచలనంగా మారింది. 12వ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది.కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు బాడీని పోస్టుమార్టంకు పంపిన పోలీసులు దీనివెనుక అసలు కారణంపై పరిశోధన చేస్తున్నారు. అయితే అధికారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమన్న ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వర్లు స్వగ్రామం నల్లగొండ జిల్లా వలిగొండ గ్రామం. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ రక్షణగా వెంకటేశ్వర్లకు డ్యూటీవేశారు. కొద్దిరోజులుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాడు. కేసీఆర్ ఫాం హౌస్ లో  కానిస్టేబుల్ సూసైడ్ చర్చనీయాంశంగా మారింది.