Begin typing your search above and press return to search.

టెక్నాలజీని వాడేసుకుంటున్న పేకాటరాయుళ్లు !

By:  Tupaki Desk   |   11 July 2020 11:30 PM GMT
టెక్నాలజీని వాడేసుకుంటున్న పేకాటరాయుళ్లు !
X
భారత్ లో రోజురోజుకి కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరెన్సీ విధానానికి స్వస్తి పలకాలని డిజిటల్ విధానంలో చెల్లింపులకి ఎక్కువ ప్రాధాన్యత ప్రభుత్వాలు చెప్తున్న సంగతి తెలిసిందే. లిక్విడ్ డబ్బు కోసం ఏటీఎం సెంటర్స్ కు వెళ్లడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఉంది , దీనితో ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, మంచి కోసం ప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల వైపు అడుగులు వేయమంటే దాన్ని ఇంకో విధంగా వాడేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు.

ముఖ్యంగా పేకాటరాయుళ్లు ఈ డిజిటల్ చెల్లింపులని బాగా వాడుకుంటున్నారు. ఒకప్పుడు పేకాటరాయుళ్లు డబ్బు దగ్గర పెట్టుకొని పేకాట ఆడేవారు. అలాంటి సమయంలో అనుకోకుండా పోలీసులు రైడ్ చేస్తే వారి వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు దొరికేది. కానీ , ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు ఉండటంతో పేకాటరాయుళ్లు కూడా డిజిటల్ రంగాన్ని ఆశ్రయిస్తున్నారు. దీనితో ఇప్పుడు పేకాట స్థావరాల పై పోలీసులు దాడి చేసినప్పటికీ కూడా వారి వద్ద డబ్బు దొరకడం లేదు.

తాజాగా తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలోని పొట్టిలంక వద్ద ఉన్న ఓ పౌల్ట్రీ ఫారం షెడ్ లను పేకాట శిబిరాలుగా మార్చుకొని కొంతమంది పేకాడుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందటంతో దాడి చేశారు. ఈ దాడిలో 17 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అయితే , ఆ తరువాత అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. పేకాటరాయుళ్లు పేకాట అదే దగ్గర డబ్బుకి బదులు ఫోన్ పే ఉపయోగిస్తున్నారట.అక్కడ అట లో కూర్చోవాలి అంటే అకౌంట్ లో మినిమం రూ.50వేలు ఉండాలట. అలా లేకపోతె వారికీ పేకాట ఆడే అవకాశం ఉండదట.