మోడీని రాహుల్ గాంధీ బాగా ఇరికించాడా?

Mon Aug 10 2020 09:00:41 GMT+0530 (IST)

Pm Narendra Modi Vs Rahul Gandhi

2019లో తన సారథ్యంలో కాంగ్రెస్ ఓడాక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలో బాగానే మార్పు కనిపిస్తోంది. ఆయనలో పరిణతి బాగా ఘోచరిస్తోంది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీని ప్రతీసారి రాహుల్ గాంధీ పదునైన విమర్శలతో ఇరికిస్తూనే ఉన్నాడు.ఇప్పటికే రఫేల్ డీల్ పెద్ద కుంభకోణమన్న రాహుల్ గాంధీ ఆరోపణలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దానిపై మోడీ కానీ బీజేపీ కానీ స్పందించిన దాఖలాలు లేవు. అలాగే చైనాతో యుద్ధంలో జరిగిన ఘటనలపై కూడా రాహుల్ నిలదీసి ఇరుకునపెట్టాడు.

ఇప్పుడు తాజాగా ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల్లో గెలుపు కోసం ఇచ్చిన హామీలను ఏకరువు పెడుతూ రాహుల్ గాంధీ ఇరుకునపెడుతున్నాడు.

ఏడాదికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్రమోడీ నిలబెట్టుకోలేకపోయారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. ఉద్యోగాలపై యువత కలలను మోడీ అమ్మేశారని ఆరోపించారు.

మోడీ ప్రభుత్వ విధానాలతో 14 కోట్ల మంది నిరుద్యోగులు అయ్యారని.. నోట్ల రద్దు జీఎస్టీ  కరోనా లాక్ డౌన్ వంటి తప్పుడు విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని రాహుల్ ఆరోపించారు. దేశంలో ఇప్పుడు కరోనా లాక్ డౌన్ తో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కోల్పోయిన నిరుద్యోగులకు బాసటగా నిలిచి మోడీని రాహుల్ గాంధీ బాగానే ఇరికించాడని విశ్లేషకులు అంటున్నారు.