Begin typing your search above and press return to search.

వైసీపీ ఉగ్రవాదిని.. బరెస్ట్ అయిన కమెడియన్ ఫృథ్వీ

By:  Tupaki Desk   |   26 Jun 2022 12:30 AM GMT
వైసీపీ ఉగ్రవాదిని.. బరెస్ట్ అయిన కమెడియన్ ఫృథ్వీ
X
టాలీవుడ్ కమెడియన్ , థర్డ్ ఇయర్స్ ఫృథ్వీ ఇటీవల బరెస్ట్ అయ్యాడు. తాను రాజకీయంగా ఎదిగిన వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. సినిమాల్లో మంచి కమెడియన్ గా గుర్తింపు పొంది.. 2014కు వైసీపీలో చేరిన ఫృథ్వీ ఆ పార్టీ తరుఫున జోరుగా ప్రచారం చేశారు. 2019లోనూ పార్టీ కోసం పాటుపడ్డాడు. వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ ఏరికోరి ఎస్వీబీసీ చైర్మన్ పదవిని ఫృథ్వీకి కట్టబెట్టాడు. అయితే వివాదాలతో ఆ పదవిని వదులుకున్న ఫృథ్వీ వైసీపీ కార్యక్రమాలకు కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్నారు.

తాజాగా కమెడియన్ ఫృథ్వీ ఇాప్పుడు అదే పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో ఆ పార్టీ కండువా కప్పుకున్నానని చెప్పిన ఫృథ్వీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా వైసీపీ పార్టీపై విరుచుకుపడుతున్న ఫృథ్వీ తాజాగా ఓ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ 'వైసీపీ పార్టీని ఉగ్రవాద సంస్థతో పోల్చడం' రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇక తన రాజకీయ జీవితంలోని చాలా విషయాలపై ఫృథ్వీ ఓపెన్ అయ్యాడు. పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్టుగా ఒకతను తన మైండ్ ను పొల్యూట్ చేసి వైసీపీ వైపు నడిపించాడని ఫృథ్వీ ఆరోపించాడు.

వైసీపీలోకి వెళ్లాక అహంకారం, కొవ్వు, మదం పట్టి నేనే టాప్ అన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడేశానని.. అప్పుడు అక్కడున్నది ఫృథ్వీ కాదని.. ఒక ఉగ్రవాది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో ఒక మూర్ఖుడిగా ఉండిపోయానని అన్నాడు. ఫృథ్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

2024 ఎన్నికలపై కూడా ఫృథ్వీ హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయాడని.. గెలవలేకపోయాడని.. కానీ వచ్చే ఎన్నికల్లో 40 సీట్లు కొట్టబోతున్నాడని.. నేను రాసిస్తాను అంటూ ఫృథ్వీ ఘంఠాపథంగా చెప్పుకొచ్చాడు. ఏపీలో జనసేన జెండా ఎగురుతుందని తెలిపారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ అంటూ ఫృథ్వీ బల్లగుద్ది వాదించారు.

2024లో మంచి బస్సు ఎక్కి వారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నానని.. జనసేన బస్సు ఎక్కితే చంద్రబాబు గారితో ఉండొచ్చని చెప్పడం జనాన్ని తికమక పెట్టడమేనని అన్నారు. మొత్తానికి ఫృథ్వీ మాటలను బట్టి నెక్ట్స్ చేరబోయేది జనసేనలోనేనని అర్థమవుతోంది. వైసీపీని తిడుతూ పవన్ ను పొగడడం చూస్తే అదే అనిపిస్తోంది.