Begin typing your search above and press return to search.

జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు!?

By:  Tupaki Desk   |   1 March 2021 5:30 AM GMT
జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు!?
X
దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మళ్లీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మళ్లీ ఒకప్పటి ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి చేర్చాలని కేంద్రం ఆలోచిస్తోంది.కేంద్ర ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రహ్మణియన్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

కేంద్రం స్థాయిలో తాజా పరిణామాలు రాష్ట్రాలకు షాకింగ్ గా పరిణమించాయి. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ తెస్తే రాష్ట్రాలకు దమ్మిడి ఆదాయం రాదు. అవి పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతాయి. దీన్ని రాష్ట్రాలు గతంలో తీవ్రంగా వ్యతిరేకించాయి.

పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ)పరిధిలోకి తీసుకురావడం మంచి ప్రతిపాదన అని... అయితే దీనిపై నిర్ణయాధికారం మాత్రం జీఎస్‌టీ కౌన్సిల్‌దే అని కేవీ సుబ్రమణియన్‌ అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు పెరిగాయని అభిప్రాయపడ్డారు.

ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇదే అన్నారు. తాజాగా ఆర్థిక సలహాదారు కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.