Begin typing your search above and press return to search.

హ‌మ్మ‌య్య‌!: ఆ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు.. జ‌నాల‌కు కొంత రిలీఫ్‌!

By:  Tupaki Desk   |   22 May 2022 11:04 AM GMT
హ‌మ్మ‌య్య‌!: ఆ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు.. జ‌నాల‌కు కొంత రిలీఫ్‌!
X
దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు తారాజువ్వ‌ల్లా ఎగ‌బాకి.. కేవ‌లం 125 వ‌ర‌కు చేరుకున్నాయి. అయితే.. ఒక్క‌సారిగా.. ధ‌ర‌లు త‌గ్గిస్తూ.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌బుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. లీట‌రు పెట్రోల్‌పై రూ.8, లీట‌రు డీజిల్‌పై రూ.6 చొప్పున త‌గ్గించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఊపిరాడ‌ని.. సామాన్యుడు.. కొంత లో కొంత ఊపిరి పీల్చుకునే అవ‌కాశం ద‌క్కింది. ఈ ధ‌ర‌ల త‌గ్గింపు.. ఇత‌ర నిత్యావ‌స‌రాల‌పైనా ప్ర‌భావం చూపుతుండ‌డంతో అవి కూడా దిగివ‌చ్చే అవ‌కాశం ఉంది.

అయితే.. ఇప్పుడు ఇంత అనూహ్యంగా మోడీ ప్ర‌బుత్వం జ‌నాల‌పై ఇంత క‌రుణ కురిపించ‌డం ఏంటి? ఎం దుకు? అనే విష‌యం ఆస‌క్తిగా మారింది. దీనిని ప‌రిశీలిస్తే.. చాలా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు క‌నిపిస్తు న్నాయి. మ‌రో రెండు మూడు నెల‌ల్లో కీల‌క‌మైన రెండు రాష్ట్రాల‌కు మ‌రో ఆరు మాసాల్లో మ‌రో రెండు కీల‌క రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. ఈ నాలుగు చోట్ల కూడా.. బీజేపీకి అనుకున్న విధంగా ఫాలోయింగ్ క‌నిపించ‌డం లేదు. పైగా.. ప్ర‌జ‌ల్లో ఆయా రాష్ట్రాల్లో వ్య‌తిరేక‌త కూడా క‌నిపిస్తోంది.

ఇక‌, ఈ ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల్లో మోడీ సొంత రాష్ట్రం గుజ‌రాత్‌, మ‌రో రాష్ట్రం హిమాచ‌ల్ ప్ర‌దే శ్ ఉన్నాయి. మోడీకి ప్ర‌ధాన ఆయువు ప‌ట్టు గుజ‌రాత్. ఇక్క‌డ నాలుగు సార్లుగా వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని 20 ఏళ్లుగా ప్ర‌జ‌ల‌ను పాలిస్తున్నారు. ఈ ఏడాది న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఇప్పుడు ఇక్కడ ఇత‌ర ప్రాంతీయ పార్టీలు బ‌లోపేతం అయ్యాయి. పైగా ప్ర‌జ‌ల్లో బీజేపీ అంటే బోర్ కొట్టింద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

అంటే.. గుజ‌రాత్‌లో బీజేపీకి ప్ర‌మాద ఘంటిక‌లు మోగుతున్నాయి. ఇక‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇక్క‌డ కూడా ఈ ఏడాది న‌వంబ‌రులోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రో రెండు కీల‌క రాష్ట్రాలుక‌ర్ణాట‌క‌, రాజ‌స్థాన్‌లలో వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలోపే ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. ఇక్క‌డ క‌ర్ణాట‌క‌లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే.. ఇక్క‌డ త‌లెత్తిన రాజ‌కీయ సంక్షోభం.. హిజాబ్ వివాదం.. వంటివి బీజేపీని ఖంగారు పెట్టిస్తున్నాయి. రాజస్థాన్‌లో కాంగ్రెస్ సానుకూల ప‌వ‌నాలే వీస్తున్నాయి.

అంటే.. మొత్తంగా నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఎదురుగాలి బాగానే వీస్తోంద‌న్న అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మోడీ చాక‌చ‌క్యంగా.. పెట్రోల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించార‌నేది వాస్త‌వం. అయితే. ఎన్నిక‌లు ఎప్పుడో ఉంటే.. ఇప్పుడే ఎందుకు త‌గ్గించార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఎన్నిక‌ల‌కు ముందు క‌నుక త‌గ్గిస్తే.. ఎన్నిక‌ల జిమ్మిక్కు చేశారంటూ.. ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తాయి. అదేస‌య‌మంలో అప్ప‌టిక‌ప్పుడు త‌గ్గిస్తే.. మిగిలి సేవ‌ల ధ‌ర‌లు త‌గ్గ‌వు అవి త‌గ్గాలంటే.. కొంత స‌మ‌యం ప‌డుతుంది. అదే ఇప్పుడు క‌నుక‌.. త‌గ్గిస్తే.. అప్ప‌టికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌నే ఉద్దేశంతో మోడీ ప్లాన్ చేశార‌నేది విశ్లేష‌కకుల మాట‌.