Begin typing your search above and press return to search.

పూనావాలా 'Z +' భద్రత కల్పించాలి .. హైకోర్టులో పిటిషన్ !

By:  Tupaki Desk   |   6 May 2021 8:30 AM GMT
పూనావాలా Z + భద్రత కల్పించాలి .. హైకోర్టులో పిటిషన్ !
X
అదర్ పూనావాలా .. ఇప్పుడు ఈ పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోవిషీల్డును ప్రకటించిన నాటి నుంచి సీరం ఇన్‌స్ట్యూట్ అధినేత అదర్ పూనావాలా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మనదేశం లో కరోనా వ్యాక్సిన్‌కు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో పూనావాలా ఉన్నట్లుండి లండన్‌ కు వెళ్ళిపోయి అక్కడే వుండిపోవడం అనుమానాలకు తావిస్తోంది. దేశంలో కరోనా ఫస్ట్ వేవ్‌ ని నియంత్రించినప్పటికీ సెకెండ్ వేవ్క రోనా మాత్రం దేశాన్ని వణికిస్తోంది. రికార్డు స్థాయిలో నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇలా కొనసాగుతున్న తరుణంలో అదర్ పూనావాలా లండన్‌కు వెళ్ళిపోయిన విషయం చర్చనీయాంశమైంది.

తన బిజినెస్ ఎక్స్‌ పాన్షన్‌ లో భాగంగా అంతర్జాతీయ మార్కెట్‌ లో కోవీ షీల్డును మార్కెటింగ్ చేసుకునేందుకు వెళ్ళినట్లు ఓ వైపు ప్రచారం జరుగుతుంటే అదర్ పూనావాలా మాత్రం ది టైమ్స్‌కిచ్చిన ఇంటర్వ్యూలో తనకు తీవ్రంగా ఒత్తిళ్లు వస్తున్నాయని, దేశంలోని కొందరు అత్యంత బలవంతులైన ప్రముఖులు కోవిషీల్డ్‌ సరఫరా కోసం డిమాండ్‌ చేస్తూ దురుసుగా మాట్లాడుతున్నారని పూనావాలా ఇంటర్య్వూలో తెలిపారు. పూనావాలాకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరీ భద్రత కల్పించింది. అంతటి భద్రత వున్న వ్యక్తి ఉన్నట్లుండి లండన్ వెళ్ళిపోవడం, తనకు ఒత్తిళ్ళున్నాయంటూ ఆరోపణలు చేయడం కొనసాగుతున్నా కేంద్ర ప్రభుత్వం పూనావాలా వ్యవహారంలో స్పందించడం లేదు. ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ కాలం యుకే లో వుండిపోవడానికి కారణం మనదేశంలో తనకు రక్షణ లేదని భావించడమేనని పూనావాలా చెబుతున్నారు.

కానీ భారత్‌ లో వ్యాక్సిన్ ధర విషయంలో ఎదుర్కొన్న విమర్శలు కూడా అదర్ పూనావాలా లండన్ పయనమవడానికి కారణమని కొందరు చర్చించుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఉత్పత్తి అవుతున్న రెండు వ్యాక్సిన్లలో కోవిషీల్డు అత్యధికంగా ఉత్పత్తి అవుతోంది. ప్రతీ రోజు 6 కోట్ల డోసుల వ్యాక్సి న్‌ను సీరం సంస్థ కోవిషీల్డును తయారు చేస్తుంది. ఇదిలా ఉంటే .. తాజాగా సీరం అధినేత అదర్ పూనావాలా కి జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి అంటూ ముంబై హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే అయన కుటుంబానికి కూడా జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి అని ముంబై కి చెందిన లాయర్ దత్తా మెన్ పిటిషన్ ధాఖలు చేశారు. ఎక్కువ స్థాయిలో కోవిషీల్డు ఉత్పత్తి అవుతున్న పరిస్థితిలో తమకంటే తమకు సరఫరా చేయాలని పలువురు ఒత్తిళ్ళకు పాల్పడడం వల్లనే తాను యుకే వెళ్ళినట్లు పూనావాలా చెప్తున్న నేపథ్యంలో ఆయనకి మరింత భద్రత ను ఏర్పాటు చేయాలని అన్నారు.