రాకెట్ ప్రయోగం ఇక లైవ్ లో ఉండి చూడొచ్చు.. ఎలా వెళ్లాలంటే?

Thu Jun 23 2022 16:00:02 GMT+0530 (IST)

Permission for the public to watch the PSLV rocket launch live

కరోనా కల్లోలంతో అందరి జీవితాలు మారిపోయాయి. సమూహంగా కూర్చొని చూసే రోజులే పోయాయి. క్రికెట్ ఇతర ఆటలను ఇప్పుడిప్పుడే జనాలకు అనుమతులు రావడంతో చూస్తున్నాయి. ఇన్నాళ్లు టీవీలోనే చూసిన రాకెట్ ప్రయోగ పరీక్షలను ఇప్పుడు లైవ్ లో చూసే అవకాశం ప్రజలకు దక్కింది.కరోనా సోకినప్పటి నుంచి ప్రజలు ఇలా రాకెట్ ప్రయోగాన్ని చూసేందుకు అనుమతించలేదు. తాజాగా ఓకే చెప్పారు.

శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈనెల 30న నింగిలోకి పంపనున్న పీఎస్ఎల్వీ  సీ53 రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా ఈ దఫా సందర్శకులకు అనుమతి ఇచ్చారు. రాకెట్ ప్రయోగ వీక్షణకు ఇక్కడ 10వేల మంది సామర్థ్యంతో సందర్శకుల గ్యాలరీని నిర్మించారు.

కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల పాటు సందర్శకులకు అనుమతి ఇవ్వలేదు.ఈ దఫా అనుమతి ఇవ్వాలని ఇస్రో నిర్ణయించింది. ఔత్సాహికులు ఈనెల 23వ తేదీ గురువారం ఉదయం నుంచి 28వ తేదీ సాయంత్రం 4 గంటల వరకూ ఇస్రో వెబ్ సైట్లో పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించింది.

ఇస్రో ఉపగ్రహ వాహక నౌక పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు.

ఆనవాయితీ ప్రకారం నమూనా రాకెట్‌కు తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్త్రో శాస్త్రవేత్తల బృందం   ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా ద్వారా   కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ప్రయోగాలు ఇప్పుడు ఊపందుకున్నారు..

దాదాపు పది నెలల అనంతరం ప్రయోగం నిర్వహిస్తుండగా.. కరోనా తర్వాత తొలిసారి ప్రజలను అనుమతిస్తున్నారు.