బ్రేకింగ్: కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రైల్స్ కు అనుమతి

Sat Oct 17 2020 21:00:41 GMT+0530 (IST)

Breaking: Permission for corona vaccine clinical trials

ప్రపంచంలోనే అందరికంటే ముందు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ రష్యాదే.. రష్యా ‘స్పుత్నిక్-వీ’ పేరు రెండు ట్రయల్స్ మాత్రమే నిర్వహించి వ్యాక్సిన్ ను విడుదల చేసింది. మూడో దశలో ఉన్న ఈ వ్యాక్సిన్ ప్రయోగాలను తాజాగా భారత్ లోనూ జరిపేందుకు రెడీ అయ్యింది. తాజాగా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రష్యా తయారు చేసి ఆ దేశస్థులకు పంపిణీ చేసిన ‘స్పుత్నిక్ వి’ వ్యాక్సిన్ ప్రయోగాలకు దేశంలో కేంద్రం పచ్చా జెండా ఊపింది.హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ‘డాక్టర్ రెడ్డీస్’ లాబొరేటరిస్ తో రష్యాన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్.డీ.ఐ.ఎఫ్) లు ఒప్పందం చేసుకొని ఈ రష్యాన్ వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగాలకు రెడీ అయ్యాయి. ఈ రెండు కంపెనీలకు భారత డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ ) తాజాగా అనుమతి ఇచ్చింది.

రెండో దశల ప్రయోగాలు పూర్తి చేసుకున్న రష్యా వ్యాక్సిన్ భారత్ లో కూడా క్లినికల్ ట్రయల్స్ ను చేయనున్నారు.. మూడో దశను భారత్ లో పూర్తి చేసి పంపిణీ చేసేందుకు రష్యా సంస్థ భారత ప్రముఖ ఔషధ కంపెనీ ‘డాక్టర్ రెడ్డీస్’తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో భారత ఫార్మా దిగ్గజం ‘డాక్టర్ రెడ్డీస్’తో రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్(ఆర్డీఐఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది.  భారత్ లో క్లినికల్ ట్రయల్స్ చేపట్టడంతోపాటు 10 కోట్ల వ్యాక్సిన్ డోసులను భారత్ లో సరఫరా చేసేందుకు వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రం  అనుమతి ఇవ్వడంతో ఇక ఈ ప్రక్రియ వేగం కానుంది.

దీనిపై రష్యా అధికారులతో చర్చలు జరిపేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు రష్యాతో చర్చలు జరిపింది. 3వ దశ ప్రయోగాలు పూర్తి చేసి వచ్చే రెండు నెలల్లో  ఆ వ్యాక్సిన్ భారత ప్రజలందరికీ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

రష్యా వ్యాక్సిన్ రెండు దశలకే విడుదల చేసింది. పైగా ప్రయోగాల్లోనూ ఎలాంటి దుష్ప్రభావాలు లేవని ప్రముఖ జర్నల్స్ ప్రచురించాయి. దీంతో రష్యా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు భారత్ లో చేసి ఇక్కడ ప్రజలకు అందించాలని డాక్టర్ రెడ్డీ రష్యా ఒప్పందం చేసుకోవడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.