Begin typing your search above and press return to search.

రొమాన్స్ విషయంలో మనోళ్లు ఎంత వీక్ అంటే?

By:  Tupaki Desk   |   12 July 2020 1:50 PM GMT
రొమాన్స్ విషయంలో మనోళ్లు ఎంత వీక్ అంటే?
X
ఎవరెన్ని చెప్పినా.. ఆఖరికి వచ్చి ఆగేది రొమాన్స్ దగ్గరే. ఇద్దరి మధ్య మొదలయ్యే స్నేహం గాఢత పెరిగి.. తర్వాత ఎన్ని లెవెల్స్ కు వెళ్లినా.. అంతిమంగా రొమాన్సు దగ్గరకు వెళ్లాకే పూర్తి అవుతుంది. చాలామంది దీన్ని చులకనగా.. చిన్నచూపుగా.. తప్పుగా చూస్తారే తప్పించి.. జీవితంలో దీనికుండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనిషి జీవితాన్ని చాలా సందర్భాల్లో ఈ అంశమే ప్రభావితం చేస్తుంది. అయితే.. దీని విషయంలో విచక్షణ మిస్ అయినోళ్లు తిప్పలు పడితే.. ఎంతకు పరిమితం కావాలన్న విషయంలో తీసుకునే నిర్ణయం తదనంతర పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే.. రొమాన్సు తర్వాత మనిషిలోని ఒత్తిడి చాలావరకు తగ్గిపోతుంది. స్ట్రెస్ బస్టర్ గా పలువురు అభివర్ణిస్తారు. శృంగార సమయంలో ప్రతి అవయువం యాక్టివేట్ కావటమేకాదు.. గుండెకు మంచి రక్తం సరఫరాలోనూ కీలకభూమిక పోషిస్తుంటుంది. మెదడు చురుగ్గా పని చేయటంలోనే కీలకం.

తాజాగా ఏ దేశంలో సెక్స్ చేసే సరాసరి సమయం ఎంతన్న అంశంపై సర్వేను నిర్వహించారు. వారు చెప్పిన సమాధానాల్ని క్రోడీకరించిన తర్వాత తేల్చిందేమంటే.. అమెరికన్లు సరాసరిగా పదమూడు నిమిషాల పాటు శృంగారంలో పాల్గొంటారని తేల్చారు. అదే సమయంలో యూరప్ దేశాలకు చెందిన వారి సెక్స్ సమయం యావరేజ్ గా పది నిమిషాలు ఉంటుందట.

ఇక.. భారత్ విషయానికి వస్తే.. మన దేశంలోని వారి రొమాన్స్ సమయం కేవలం ఏడు నిమిషాలేనని చెబుతున్నారు. మిగిలిన దేశాలతో పోలిస్తే మన టైం తక్కువగా కావటం.. మొహమాటంతోనూ.. ఇతర అంశాల కారణంగా తక్కువ సమయంలోనే ముగిస్తారని చెబుతున్నారు. దేశంలోని ముప్ఫై శాతం మంది ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ తో బాధ పడుతున్నారని సర్వే వెల్లడించింది. ఇలాంటి వారు తప్పనిసరిగా వైద్యులు అవసరం ఉందని చెబుతున్నారు.