Begin typing your search above and press return to search.

విదేశాల్లో మిడ‌త‌ల ఫుడ్‌ కు భారీ డిమాండ్‌: పొడులు, బిస్కెట్లు త‌యారీ

By:  Tupaki Desk   |   31 May 2020 1:30 AM GMT
విదేశాల్లో మిడ‌త‌ల ఫుడ్‌ కు భారీ డిమాండ్‌: పొడులు, బిస్కెట్లు త‌యారీ
X
ప్ర‌స్తుతం దేశంలో మిడ‌త‌ల దండు ప్ర‌వేశించ‌డంతో వాటిపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర వార్త‌లు తెలుసుకుంటున్నారు. వాస్త‌వంగా దీనికి ముందు కొంద‌రికి మిడ‌త‌లు అంటే కూడా ఏమిటో తెలియ‌ని ప‌రిస్థితి. ఇప్పుడు దేశంలో మిడ‌త‌ల దండు ప్ర‌వేశించ‌డంతో స‌ర్వ‌త్రా వాటిపైనే చ‌ర్చ సాగుతోంది. ఈ సంద‌ర్భంగా గూగుల్‌, యూట్యూబ్‌లలో మిడ‌త‌ల కోసం తెగ ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ విష‌యం తెలిసింది. మిడ‌త‌లు కూడా మానవుడి ఆహారంలో ఒక భాగ‌మ‌ని. చేప‌, రొయ్య‌లు, చికెన్‌, మ‌ట‌న్ ఎలాగో మిడ‌త‌లు కూడా ఆ విధంగా ఉంది. విదేశాల్లో మిడ‌త‌ల ఫుడ్‌కు భారీగా డిమాండ్ ఉంది. అత్య‌ధిక ప్రోటీన్ల‌తో కూడిన మిడ‌త‌ల‌ను తినేందుకు విదేశీయులు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. మ‌న దేశం రాజస్థాన్‌లో మిడతలతో బిర్యానీ కూడా చేసుకుని తినేస్తున్నారు. వీటితో పాటు మ‌రికొన్ని ఆహార ప‌దార్థాలు త‌యారుచేసుకుని తింటున్నారు. అవేంటో.. వాటి ర‌కాలేంటో తెలుస‌కోండి.

మిడ‌త‌లు విదేశాల్లో బాగా తింటున్నారు. ముఖ్యంగా ఫిన్‌ల్యాండ్‌లోని బేకరీ నిర్వాహకులు మిడతలతో పొడిని చేసి వంటకాల్లో వాడేస్తున్నారు. మ‌నం ధ‌నియాల పొడి, మ‌సాల మాదిరి వారు అక్కడ మిడ‌త‌ల‌తో తయారుచేసిన పొడిని వాడుతున్నారు. బ్రెడ్లలో మిడతల పొడిని వినియోగిస్తున్నారు. మిడతలను బాగా ఎండబెట్టి, పిండి చేసి.. ఆ మిశ్రమాన్ని బ్రెడ్‌ తయారీకి ఉపయోగించే పిండిలో కలుపుతున్నారు. దాన్ని బాగా వేయించి వినియోగదారులకు అందిస్తున్నారు.

ఈ ప్రయత్నంతో ఆహారంలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నట్లు బేక‌రి నిర్వాహ‌కులు చెబుతున్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రోటీన్లతో కూడిన మిడతల పొడితో తాము బ్రెడ్ తయారు చేసిన‌ట్లు చెప్పారు. ఈ బ్రెడ్‌ను తిన్న ఓ మహిళ ఇది సాధారణ బ్రెడ్ మాదిరే ఉంద‌ని, రుచిలో పెద్ద తేడా ఏమీ కనిపించలేదని తెలిపింది. పంట పొలాల్లో ఎక్కువగా ఉండే గడ్డిపురుగు తరహా మిడతలు ఉన్నాయి. వీటిలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రపంచంలో 2 బిలియన్ ప్రజలు పురుగులను ఆహారంగా తింటున్నారు. వీటిని చైనా, మెక్సికో, బ్రెజిల్, ఘనా, థాయ్‌లాండ్ దేశీయులు ఎక్కువగా పురుగులను తింటారు. ఈ మిడ‌త‌ల్లో ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, ఐరన్, విటమిన్ బీ 12 ఉంటాయి.