ఏపీ ప్రభుత్వం పెట్రో ధరలు తగ్గించాల్సిందే: పవన్ డిమాండ్

Sun May 22 2022 18:31:31 GMT+0530 (India Standard Time)

Pawankalyan Fires On YSRCP

రోజురోజుకు పెరిగిపోతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు.. పెట్రోలు డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని  జనసేన అధినేత పవన్కల్యాణ్ అన్నారు. రోడ్డు సెస్ పేరుతో.. వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి ఏటా రూ.600 కోట్లు వసూలు చేస్తోందని మండిపడ్డారు. అయినా రోడ్లను బాగు చేసే పరిప్థితి ప్రస్తుతం ఎలాగూ కనిపించడం లేదని ధ్వజమెత్తారు. కనీసం పెట్రోలు డీజిల్పై స్థానిక పన్నులను తగ్గించి ఊరట కలిగించాలని డిమాండ్ చేశారు.పెట్రోలు డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్ర మార్గాన్ని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించాలని సూచించారు. రోజురోజుకీ పెరుగుతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు పెట్రోలు డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని తెలిపారు. పెట్రోలు 9.50 పైసలు డీజిల్ రూ.7 వరకు తగ్గడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసర వస్తువుల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉండడం అల్పాదాయ మధ్య తరగతి ప్రజలకు కొంత స్వాంతన కలిగిస్తుందని పేర్కొన్నారు.

పీఎమ్ ఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై 200 తగ్గించడం పేదవారికి ఆర్థికంగా మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇంధన ధరలపై స్థానిక పన్నులు అన్ని రాష్ట్రాలలో కంటే ఏపీలోనే అధికంగా ఉన్నాయని విమర్శించారు. పెట్రోలు డీజిల్ కొనుగోలుపై రోడ్డు సెస్ పేరుతో.. వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి ఏటా రూ.600 కోట్లు వసూలు చేస్తోందని మండిపడ్డారు. అయినా రోడ్లను బాగు చేసే పరిప్థితి ప్రస్తుతం ఎలాగూ కనిపించడం లేదని ధ్వజమెత్తారు. కనీసం పెట్రోలు డీజిల్ పై స్థానిక పన్నులను తగ్గించి ఊరట కలిగించాలని డిమాండ్ చేశారు.

పలు రాష్ట్రాల్లో తగ్గింపు..

పెట్రో భారం నుంచి సామాన్యులకు కాస్త ఉపశమనం కల్పించడంలో కేంద్రం బాటలోనే పలు రాష్ట్రాలు పయనిస్తున్నాయి. లీటర్పై 8 రూపాయలు డీజిల్పై 6 రూపాయల ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేరళ రాజస్థాన్ రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తుల పన్నును తగ్గించాయి. కేరళ ప్రభుత్వం పెట్రోల్పై 2.41 రూపాయలు డీజిల్పై 1.36 రూపాయలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ కూడా పన్నును తగ్గించింది. పెట్రోల్పై 2.48 రూపాయలు డీజిల్పై 136 మేర తగ్గించినట్లు ముఖ్యమంత్రి   తెలిపారు.