దిశకు న్యాయం..కామాంధులకు కనువిప్పు: పవన్

Fri Dec 06 2019 17:34:01 GMT+0530 (IST)

దిశ ఉదంతం కనువిప్పు కావాలని.. బహిరంగ శిక్షలు అమలు చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై పవన్ కళ్యాణ్ స్పందించారు. మన దేశంలో ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ‘దిశ’ ఉదంతం చట్టాలు సరిపోవని ఈ ఘటన హెచ్చరిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు కోరుకున్న న్యాయం ‘దిశ’ ఉందతం జరిగిందని పవన్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటనను పవన్ విడుదల చేశారు.నిందితులను ఎన్ కౌంటర్ చేశారు కాబట్టి దిశ ఘటన ముగిసిపోలేదని.. ఇంతటితో వదిలిపెట్టకూడదని.. మరే బిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. నిర్భయ ఘటన తర్వాత బలమైన పార్లమెంట్ బలమైన చట్టాన్ని తీసుకొచ్చినా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగలేదన్నారు.

ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా కఠినమైన చట్టాలు దేశంలో రావాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మేధావులు - నిపుణులు ముందుకు కదిలి ఇలాంటి ఘాతుకాలకు చరమగీతం పాడాలన్నారు. ఈ కేసుల్లో రెండు మూడు వారాల్లోనే కేసులు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఉరిశిక్ష అయినా.. మరే శిక్ష అయినా బహిరంగంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.