ఎమ్మెల్యే రాపాకకు పవన్ కల్యాణ్ లేఖ ...

Mon Jan 20 2020 16:36:30 GMT+0530 (IST)

Pawan Kalyans letter to MLA Rapaka Vara Prasad

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాజధానిని తరలించేందుకు వీలుగా - ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడితే... మద్దతిస్తానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పడంతో ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై చర్చించిన పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టే బిల్లుల్ని వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతూ ఓ లేఖను జనసేన ఎమ్మెల్యే రాపాకకు పంపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్ మెంట్ రిజియన్ యాక్ట్ 2020 - అమరావతి మెట్రో డెవలప్ మెంట్ యాక్ట్ 2020 బిల్లుల్ని వ్యతిరేకించాలని పవన్ కళ్యాణ్ ఆ లేఖలో తెలిపారు.అసెంబ్లీ సమావేశాలకు హాజరై పార్టీ నిర్ణయానుసారం నడుచుకోవాలని లేఖ లో రాపాకను కోరారు. ఒకవేళ రాపాక జనసేన పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.ఓ వైపు జనసేన సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తుంటే ఆయన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మాత్రం సీఎం జగన్ కు మద్దతు ఇస్తానని చెప్పటంతో స్పందించిన పవన్ కళ్యాణ్ పార్టీ ఆదేశాల మేరకు నడుచుకోవాలని హితవు పలికారు. లేదంటే క్రమశిక్షణా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. అయితే అభివృద్ధి వికేంద్రీకరణని స్వాగతిస్తున్నానని జనసేన ఎమ్మెల్యే రాపాక తెలిపారు. అభివృద్ధి ఒకేచోట జరగడం సమంజసం కాదన్న అయన .. ప్రతిదాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించడం సరికాదు అని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. కాగా బిల్లుని వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ రాపాక కు లేఖ రాయగా .. అధినేత సూచనలను రాపాక పట్టించుకోలేదు. చూడాలి మరీ రాపాక విషయంలో జనసేన ఏ నిర్ణయం తీసుకుంటుందో ..