Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ షర్మిలను చూసి నేర్చుకోవాలా?

By:  Tupaki Desk   |   17 April 2021 4:30 PM GMT
పవన్ కళ్యాణ్ షర్మిలను చూసి నేర్చుకోవాలా?
X
రాజకీయాల్లోకి వచ్చాక ఎవరైనా సరే ప్రజల్లో ఉంటేనే వారి పేరు పరపతి పెరుగుతుంది. పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తే ఎంత పెద్ద స్టార్ అయినా సరే ప్రజలు తొక్కిపడేస్తారనడానికి మన జనసేనాని పవన్ కళ్యాణ్ గొప్ప ఉదాహరణ. ఆయన సినిమాలు చేసుకుంటూ వీకెండ్ లో రాజకీయం చేస్తానంటే ఏపీ ప్రజలు ఒప్పుకోకనే పోయిన సారి రెండు చోట్ల పోటీచేసినా ఓడించారు. ఆయన పార్టీని పెద్దగా పట్టించుకోకుండా ఓడించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 7 సంవత్సరాలు అవుతున్న ఇంకా రాజకీయ పాఠాలు నేర్వడంలో వెనుకబడ్డాడని చెబుతున్నారు. ఎందుకంటే 7 సంవత్సరాలు అయినా అతడికి ఒక స్ట్రాటజీ లేదు అని తెలుస్తోంది. ఉత్త కమిటీలు హడావుడి తప్పితే పవన్ కళ్యాన్ కు సబ్జెక్ట్ లేదు అన్న విమర్శ ఉంది.. ఎందుకు ఇది అంతా చర్చ జరుగుతోందంటే.. ఇంకా పార్టీ పెట్టలేని షర్మిలకు తెలంగాణలో ప్రస్తుతం బలం లేదు.. కనీసం వార్డ్ మెంబర్ స్థాయి నాయకుడు కూడా ఆమె వెంట లేడు. కానీ తెలంగాణలోని బర్నింగ్ ఇష్యూ అయిన నిరుద్యోగుల సమస్యల మీద షర్మిల పోరాడుతూ తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటోంది.

షర్మిల చేపట్టిన దీక్షతో ఖచ్చితంగా నిరుద్యోగుల్లో ఆమెకు మైలేజ్ వచ్చింది. ఇలానే సాగితే ఆమె పార్టీ ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళుతుందని.. వీధి పోరాటాలు చేస్తేనే ప్రజల్లో పాపులర్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాపు సామాజికవర్గం నాయకులే పవన్ తీరుపై గుర్రుగా ఉన్నారట.. ' మా వాడు షర్మిలను చూసి నేర్చుకోవాలని.. ఎప్పుడు చూసినా రోడ్డు షోలు అంటాడని.. జనాలు వాళ్లే వస్తారని.. పార్టీకి క్రేజ్ వస్తుందని అనుకుంటాడని' ప్రజాపోరాటాలు చేయడని కాపు నాయకులు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి సినిమా యాక్టర్ బయటకు వస్తే.. కనీసం సీరియల్ నటి వచ్చినా జనాలు వస్తారు.. ఎందుకంటే వాళ్లు సెలబ్రెటీలు కాబట్టి చూడడానికి వస్తారని పవన్ కళ్యాన్ అర్తం చేసుకోలేక పోతున్నాడని చెబుతున్నారు. జనాలను చూసి వాపును చూసి బలుపు అనుకుంటున్నాడన్న విమర్శ ఉంది. ఒక రాజకీయ అంతర్గత సమావేశం అనేది పవన్ కళ్యాణ్ ఎప్పుడూ నిర్వహించడని.. వీధి పోరాటాలు అనేది అస్సలే చేయడని.. అయితే పార్టీ పెట్టకుండానే నాయకులు లేకుండానే మీడియా అంతా షర్మిల వైపు తిప్పుకుందని.. ఆమెను ఉన్నత స్థాయికి ఇదే తీసుకొని వెళ్తుందని మేధావులు అంటున్నారు. ఇదే పీకేకు షర్మిలకు తేడా అని అంటున్నారు.