పవన్ కల్యాణ్…స్పందించారు అది మాత్రం చెప్పలే!

Thu Nov 14 2019 23:00:01 GMT+0530 (IST)

జనసేన అధిపతి పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. తన ప్రత్యర్థులకు ఇంగితం గురించి లెక్చరిచ్చారు పవన్ కల్యాణ్. అయితే విలువల వంటి వాటి గురించి పవన్ కల్యాణ్ లెక్చర్లు ఇవ్వడం కొత్త ఏమీ కాదు. మరోసారి అదే జరిగింది.  పవన్ కల్యాణ్ ఇంగితం గురించి సుదీర్ఘ లెక్చరిచ్చారు.అయితే జగన్ స్పందన తర్వాత రెండోసారి మీడియా ముందుకు వచ్చిన  పవన్ కల్యాణ్ రెండోసారి కూడా అసలు విషయం గురించి మాట్లాడలేదు. అసలు విషయం ఏమిటంటే.. 'మీ పిల్లలు ఏ మీడియం స్కూళ్లలో చదువుతున్నారు?' ఇదీ జగన్ వేసిన ప్రశ్న. ఆ ప్రశ్నను వేస్తూ పవన్ కల్యాణ్ కు ముగ్గురు భార్యలు అనే విషయాన్ని జగన్ గుర్తుకు చేశారు. ముగ్గురు  భార్యలకు ఎందరు పిల్లలు ఉన్నారో వారు ఏ మీడియంలో చదువుతున్నారు? అని పవన్ కల్యాణ్ ను జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులను పవన్ తప్పు పట్టడంతో జగన్ ఆ విషయాన్ని ప్రస్తావించారు.

ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి అరగంట సేపు మాట్లాడిన పవన్ అప్పుడు తన పిల్లలను ఎక్కడ చదివిస్తున్న విషయం చెప్పలేదు. పవన్ స్పందన తర్వాత మంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అ తర్వాత తాజాగా పవన్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు.

ఇప్పుడు కూడా ఆయన తన పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పలేదు. అసలు విషయాన్ని చెప్పకుండా ప్రత్యర్థులకు నీతులు చెప్పారు పవన్ కల్యాణ్. వాళ్లకు ఇంగితం లేదని పవన్ తేల్చారు. అయినా పవన్ కల్యాణ్ ప్రసంగాలు వింటే ఆయనకు ఉన్న ఇంగితం ఏ పాటిదో అర్థం అవుతుంది. మళ్లీ ఆయన ప్రత్యర్థులకు ఇంగితం ఉండాలంటూ క్లాసులు పీకడం కామెడీగాఉందని పరిశీలకులు అభిప్రాయపడుతూ ఉన్నారు!