పవన్ కళ్యాణ్ 'జనసేన' దుకాణం బంద్!?

Mon Jul 06 2020 16:40:38 GMT+0530 (IST)

Pawan Kalyan's Janasena Bandh !?

జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక చాలించుకున్నాడా? పార్టీ కాడి వదిలేశాడా? 200 రోజుల అమరావతి ఉద్యమం మీద ఏమీ కామెంట్ చేయకపోవడానికి కారణమేంటి? సీఎం వైఎస్ జగన్ ఇటీవల ప్రారంభించిన 108 వాహనాలను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం దేనికి సంకేతం.. పవన్ ‘జనసేన’ దుకాణం బంద్ చేసే ఆలోచనలో ఉన్నాడా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..క్రమంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కు తత్త్వం బోధపడుతోంది. బూతు స్థాయి నుంచి నిర్మాణం లేని పార్టీని విస్తరించడం కష్టమని అర్థమవుతోందంటున్నారు. ఇప్పటికే తన అన్నయ్యలు చిరంజీవి - నాగబాబులు ఏపీ సీఎం జగన్ కు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు పవన్ కళ్యాన్ కూడా అదే బాటలో నడిచాడని అంటున్నారు. జగన్ చంద్రబాబులను మించి ఏపీలో రాజకీయ తెరపై మెరవడం కష్టమని డిసైడ్ అయినట్టు ప్రచారం సాగుతోంది.

2019 ఎన్నికల్లో ఓటమితో పవన్ కళ్యాణ్ రాజకీయం వదిలి సినిమాల మీద ఫోకస్ పెట్టేశాడు. బీజేపీతో పోత్తు పెట్టుకున్నాడు. పార్టీ టైం పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు.బీజేపీలో జనసేనను విలీనం చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఇక పార్టీ అంటే అన్నింట్లోనూ బలంగా ఉండాలి. కానీ నిర్మాణం లేని జనసేనకు మీడియా మేనేజ్ మెంట్ లేదు. సోషల్ మీడియాను నడిపించే నాయకుడు లేడు. పొలిటికల్ గా పవన్ లో నిలకడ లేదు. దీంతో టీడీపీ - వైసీపీల్లా ఏపీలో పార్టీని పవన్ నిలబెట్టలేకపోతున్నారు. ఇవన్నీ బేరిజు వేసుకొని బీజేపీలో జనసేనను విలీనం చేసి రాజకీయాల కాడి వదిలేయాలని పవన్ అనుకుంటున్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.