కేంద్రమంత్రి నిర్మల భర్త ప్రభాకర్ సంచలన ట్వీట్

Tue Jul 07 2020 23:40:39 GMT+0530 (IST)

Union Minister Nirmala's husband Prabhakar sensational tweet

దేశానికి ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ భర్త ప్రభాకర్ సంచలన ట్వీట్ తో వార్తల్లో నిలిచాడు. హైదరాబాద్ సిటీలోని ఓ బడా కార్పొరేట్ ఆస్పత్రిలో చోటుచేసుకున్న దారుణాన్ని ప్రభాకర్ వెల్లడించారు.హైదరాబాద్ లోని ఓ పెద్ద ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకున్న ఒక 83 ఏళ్ల వృద్ధుడికి 9 రోజులకు 10.50 లక్షల బిల్లు వేశారని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్లు కట్టడానికి 12 గంటల సమయం కావాలని ఆస్పత్రి యాజమాన్యం బతిమిలాడినా ఒప్పుకోలేదని పేర్కొన్నాడు. బిల్లు కట్టకుంటే రోగికి ఆక్సిజన్ తీసేస్తామని తెగేసి చెప్పారని ప్రభాకర్ ట్వీట్ చేశారు.

కేంద్రమంత్రి నిర్మల భర్త కావడంతో ప్రభాకర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు బాగా స్పందించి ప్రైవేట్ ఆస్పత్రి దారుణంపై మండిపడ్డారు. దాని పేరు చెప్పాలని ప్రభాకర్ ను కోరారు. కానీ ఆస్పత్రి పేరు చెప్పి రోగి కుటుంబానికి రోగికి హాని తలపెట్టలేను అంటూ ప్రభాకర్ తెలిపారు. డబ్బులు కట్టకుంటే ఆక్సిజన్ పైపులు ఇతర పరికరాలు తొలగిస్తామని ఆస్పత్రి వారు భయపెడుతున్నారని ప్రభాకర్ ట్వీట్ లో ఆరోపించారు.