Begin typing your search above and press return to search.

ఆరుగురు పాక్ క్రికెటర్లకు కరోనా..న్యూజిలాండ్ సిరీస్ పై అనుమానాలు!

By:  Tupaki Desk   |   26 Nov 2020 1:00 PM GMT
ఆరుగురు పాక్ క్రికెటర్లకు కరోనా..న్యూజిలాండ్ సిరీస్ పై అనుమానాలు!
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు కరోనా మహమ్మారి భారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు క్రీడాకారులు కూడా కరోనా భారిన పడ్డారు. తాజాగా న్యూజిలాండ్ పర్యటన లో ఉన్న ఆరుమంది పాక్ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ గా వచ్చినట్టు తెలుస్తుంది. కివీస్ పర్యటనలో ఉన్న పాక్ జట్టు ప్రస్తుతం క్రైస్ట్ ‌చర్చ్‌ లో ఐసోలేషన్‌ లో ఉందని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. పాజిటివ్ గా తేలిన ఆరుగుర్ని క్వారంటైన్‌ కు తరలించారు. ఐసోలేషన్ లో ఉండగా ట్రైనింగ్ పొందడానికి ఇంతకు ముందు పాక్ క్రికెటర్లకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించారు.

కరోనా లక్షణాల కారణంగా పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లని విషయం తెలిసిందే. లాహోర్‌లో హోటల్లో ఉన్న అతనికి కరోనా టెస్టులో నెగటివ్ అని తేలినప్పటికీ.. మరుసటి రోజు తీవ్ర జ్వరం రావడంతో కివీస్ పర్యటన నుంచి తప్పించారు. ఈ పర్యటనలో పాకిస్థాన్ ఆతిథ్య న్యూజిలాండ్ ‌తో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 18న ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగాల్సి ఉంది. అంతకు ముందు పాక్ జట్టు న్యూజిలాండ్-ఏ టీమ్‌ తో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. కానీ పాక్ ప్లేయర్లకు కరోనా సోకడంతో ఈ సిరీస్ ‌జరగడం పై అనుమానాలు మొదలైయ్యాయి.

న్యూజిలాండ్‌ పర్యటన కోసం ప్లేయర్లు, టీమ్‌ మేనేజ్ ‌మెంట్‌, సహాయక సిబ్బంది ఇలా మొత్తం 53 మంది న్యూజిలాండ్ ‌కు వెళ్లారు. పాకిస్తాన్‌ నుంచి బయలుదేరే ముందు లాహోర్‌ లో వీరందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఆ టెస్ట్‌లలో ఎవరికీ ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. అందరికీ నెగటివే వచ్చింది. అయితే న్యూజిలాండ్ ‌కు చేరుకున్న తర్వాత చేసిన టెస్ట్‌లలో మాత్రం ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. ఇప్పుడు పాజిటివ్‌ వచ్చిన వారికి కనీసం మరో నాలుగుసార్లు పరీక్షలను నిర్వహిస్తామని చెప్పింది న్యూజిలాండ్‌ ఆరోగ్యశాఖ.