హైదరాబాద్ : ఉరి వేసుకొని కరోనా రోగి ఆత్మహత్య

Tue Aug 11 2020 18:37:13 GMT+0530 (IST)

Hyderabad: Pandemic patient commits suicide by hanging

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. మన దేశంలో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉందని చెప్పాలి. దీని బారిన పడి రోజుకి వందల మంది మరణిస్తున్నారు. అయితే కరోనాని జయించిన ఓ వ్యక్తి ఆసుపత్రి గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.కరోనా మహమ్మారి భారిన పడి ఆ మహమ్మారి నుండి కోలుకోలేక కొందరు ప్రాణాలు వదులుతుంటే మరికొందరు కరోనా భయంతో తమకి తాముగా ప్రాణాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఓ కరోనా రోగి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీనితో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కొద్దిరోజుల క్రితం మలక్ పేటలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఏమైందో ఏమో కానీ కరోనాకి చికిత్స పొందుతున్నఆ కరోనా పేషెంట్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత రాత్రి 2: 30 గంటల సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ మలక్ పేటలోని యశోద హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. మరణానంతరం అతడి శవానికి మరోసారి కరోనా నిర్దారణ పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు సమాచారం . మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మానసిక ఆందోళన కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.