Begin typing your search above and press return to search.

గాలి, వెలుతురు పుష్కలంగా ఉంటే.. కరోనా దరిచేరదు

By:  Tupaki Desk   |   1 Nov 2020 2:30 AM GMT
గాలి, వెలుతురు పుష్కలంగా ఉంటే.. కరోనా దరిచేరదు
X
గాలి, వెలుతురు పుష్కలంగా ఉన్న ప్రదేశాల్లో ఉంటే కరోనా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నిర్వహించన ఓ అధ్యయనంలోనూ ఇదే విషయం స్పష్టమైంది. గాలి, వెలుతురు సరిగాలేని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి చోట్ల కరోనా ఎక్కువ వ్యాపిస్తుందని గతంలోనూ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రదేశాల్లో ప్రజలు గుంపులుగా ఉంటారు. వారు పీల్చిన గాలి బయటకు వెళ్లే అవకాశం ఉండదు. దీంతో కరోనా పేషెంట్​ ఎవరైనా దగ్గినా, తుమ్మినా, గట్టిగా మాట్లాడినా వైరస్​ బయటకు వచ్చే చాన్స్​ ఎక్కువగా ఉంటుంది. దీంతో కేసులు పెరుగుతాయి. ఇలాంటి చోట్లా సైతం గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చేస్తే వాయునాణ్యత, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వివిధ రూపాల్లో గాలిలో ఉండే వాయు కాలుష్యం తొలగిపోవడమో లేక పలుచన కావడమో జరుగుతుందని తాజాగా నిపుణులు తేల్చారు.

ఇది కరోనా వైరస్‌ వ్యాప్తినీ అడ్డుకుంటుందని జర్మనీలోని హాలే యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ ఎపిడమాలజీ చేసిన ‘రీ స్టార్ట్‌–19’అధ్యయనంలో వెల్లడైంది. గాలి ద్వారా ‘ఏరోసోల్స్‌’ఏ విధంగా వ్యాపిస్తాయనే విషయంపై కంప్యూటర్‌ మోడల్‌ ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలించారు. గాలి, వెలుతురు తగినంత స్థాయిలో ఉంటే వీటి వ్యాప్తి అంతగా లేదని గుర్తించారు. అందువల్ల అవసరమై న మోతాదులో గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చని తేల్చారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం వంటివి కచ్చితంగా పాటిస్తూనే.. మూసి ఉన్న ప్రదేశాల్లో గాలి, వెలుతురు సరిగా ప్రసరించేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. గాలి, వెలుతురు పుష్కలంగా ఉన్న ప్రదేశాల్లో ఉంటే కరోనా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల నిర్వహించన ఓ అధ్యయనంలోనూ ఇదే విషయం స్పష్టమైంది.

గాలి, వెలుతురు సరిగాలేని ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి చోట్ల కరోనా ఎక్కువ వ్యాపిస్తుందని గతంలోనూ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రదేశాల్లో ప్రజలు గుంపులుగా ఉంటారు. వారు పీల్చిన గాలి బయటకు వెళ్లే అవకాశం ఉండదు. దీంతో కరోనా పేషెంట్​ ఎవరైనా దగ్గినా, తుమ్మినా, గట్టిగా మాట్లాడినా వైరస్​ బయటకు వచ్చే చాన్స్​ ఎక్కువగా ఉంటుంది. దీంతో కేసులు పెరుగుతాయి. ఇలాంటి చోట్లా సైతం గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చేస్తే వాయునాణ్యత, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, వివిధ రూపాల్లో గాలిలో ఉండే వాయు కాలుష్యం తొలగిపోవడమో లేక పలుచన కావడమో జరుగుతుందని తాజాగా నిపుణులు తేల్చారు.

ఇది కరోనా వైరస్‌ వ్యాప్తినీ అడ్డుకుంటుందని జర్మనీలోని హాలే యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ ఎపిడమాలజీ చేసిన ‘రీ స్టార్ట్‌–19’అధ్యయనంలో వెల్లడైంది. గాలి ద్వారా ‘ఏరోసోల్స్‌’ఏ విధంగా వ్యాపిస్తాయనే విషయంపై కంప్యూటర్‌ మోడల్‌ ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలించారు. గాలి, వెలుతురు తగినంత స్థాయిలో ఉంటే వీటి వ్యాప్తి అంతగా లేదని గుర్తించారు. అందువల్ల అవసరమై న మోతాదులో గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చని తేల్చారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం వంటివి కచ్చితంగా పాటిస్తూనే.. మూసి ఉన్న ప్రదేశాల్లో గాలి, వెలుతురు సరిగా ప్రసరించేలా చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.