గుడ్ న్యూస్: ఏపీలో మళ్లీ భారీగా పడిపోయిన కరోనా కేసులు

Wed Sep 30 2020 23:11:16 GMT+0530 (IST)

The good news: Pandemic cases that have dropped drastically again in the AP

కొద్దిరోజుల కిందటి వరకు రోజుకు 10వేల చొప్పున కేసులు నమోదైన ఏపీలో తాజాగా కరోనా తీవ్రత తగ్గడం ఊరటనిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏపీలో కరోనా కేసుల నమోదులో తగ్గుదల కనిపిస్తోంది. డిశ్చార్జీలు పెరుగుతున్నాయి. గతంతో పోలీస్తే ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది.తాజాగా ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 6133 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 71806 టెస్టులు చేయగా దాదాపు 6వేల దాకా కేసులు వెలుగుచూశాయి. తాజాగా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 693484కు పెరిగాయి.

ఇక కరోనా వైరస్ తో మరణించిన వారి సంఖ్య మళ్లీ భారీగా తగ్గిపోయాయి. బుధవారం కరోనా బారినపడి మరణించిన వారిసంఖ్య 48గా నమోదైంది. దీంతో ఏపీలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 5828కు పెరిగింది.

ఇక తూర్పు చిత్తూరు జిల్లాల్లో కరోనా వైరస్ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ రెండు జిల్లాల్లో కలిపి రెండు లక్షలకు చేరువగా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో తాజాగా ఒక్కరోజులో 983 మందికి చిత్తూరులో జిల్లాలో 925 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ రెండు జిల్లాలో ఏపీలో ఉధృతి తీవ్రంగా ఉంది.