పాలమూరు-రంగారెడ్డి అనధికారిక ప్రాజెక్టే : తెలంగాణ పై ఏపీ ఫిర్యాదు ..

Tue Jul 14 2020 19:15:15 GMT+0530 (IST)

Palamuru-Rangareddy unofficial project: AP complaint against Telangana ..

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కృష్ణా జలాల యుద్ధం కొనసాగుతోంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అధికారికంగా చేపట్టిన ప్రాజెక్టు అని ఆ ప్రాజెక్ట్ ను రిజర్వ్ పారెస్ట్ లో నిర్మిస్తున్నారని ఆ ప్రాజెక్ట్ కి పర్యావరణ అనుమతి కూడా లభించలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. అలాగే తాము చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఆ ప్రాజెక్ట్ కు ఎలాంటి నష్టం లెదని తెలిపింది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పై స్టే ఇస్తూ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వగా దాని ఎదుట ఆంధ్రప్రదేశ్ తన వాదనను వినిపించింది. దీనిపై వాదనలు జరిగి రాయలసీమ ఎత్తిపోతల టెండర్ ప్రక్రియ చేపట్టడానికి గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతించింది. అలాగే ఈ పాలమూరు-రంగారెడ్డి రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారం తెలిపిన వాటి జాబితాలో లేదని తెలిపింది.ఆంధ్రప్రదేశ్ తరఫున ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ గ్రీన్ ట్రైబ్యునల్ ముందు దాఖలు చేసిన వాదన లోని ముఖ్యాంశాలు..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అధికార ప్రాజెక్ట్. 2006 ఈ ఐ ఎ నోటిఫికేషన్ ప్రకారం ఈ ప్రాజెక్టుకు ఇంకా అనుమతి రాలేదు. నిర్మాణానికి ముందు చేపట్టే పనులు అనుమతి వచ్చింది తప్ప ఇప్పటి వరకు తుది అనుమతి రాలేదు. పర్యావరణ అనుమతి లేకుండా రిజర్వ్ ఫారెస్ట్ లో దీనిని నిర్మిస్తున్నారు. అలాగే ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల పరస్పర అంగీకారం తెలిపిన వారి జాబితాలో కూడా లేదు. అలాంటి ప్రాజెక్టు పరిధిలో హక్కులకు భంగం వాటిల్లుతుందని దరఖాస్తుదారు పేర్కొనడం ఆశ్చర్యంగా ఉంది. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు నిర్వహణ కార్యాచరణ రూపొందించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కృష్ణా జల వివాద ట్రైబ్యునల్ 2 ఇచ్చింది. ఇదే సమయంలో 2017 జూన్ 18 19 తేదీల్లో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందంలో ప్రాజెక్టుల వారీగా వినియోగం నీటి వినియోగం నిర్వహణ కృష్ణా బోర్డు చూడాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా పర్యావరణ అనుమతి కూడా పొందకుండానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకు మూడు టీఎంసీల నీటిని మళ్లించి ఎలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి వచ్చింది. అంతర్ రాష్ట్ర జలాల సమస్యను పర్యావరణ సమస్యలు చూపిస్తున్నారు రెండు రాష్ట్రాల అవసరాలకు సంబంధించి వాదప్రతివాదనలు కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్ ముందు ఉన్నాయి.